ఉల్లంఘించలేదు, తప్పించండి: కోర్టుకు జగన్ వినతి

హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి నల్లగొండ జిల్లాలోని కోదాడలో దాఖలైన కేసు నుంచి తనకు విముక్తి కలిగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా కోదాడలో తాను ఎన్నికల ప్రవర్తనా నియమావళిను ఉల్లంఘించినట్లు వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో విచారణతో పాటు తన అరెస్టు వంటి తదుపరి చర్యలను నిలిపేయాలని ఆయన కోర్టును కోరారు.

Jagan seeks stay on poll-related cases in Telangana

ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన తాను కోదాడలో ఏ విధమైన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని, అనుమతి లేకుండా తాను రోడ్ షో నిర్వహించి, 65 నెంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించానని తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు.

అధికారుల నుంచి తగిన అనుమతి పొందిన తర్వాతనే తాను బహిరంగ సభ నిర్వహించానని ఆయన చెప్పారు. దురుద్దేశ్యపూర్వకంగా తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని ఆయన హైకోర్టును కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+