జగన్ రహస్యమేంటో: లోకేష్, సోనియాకు బాబు కంగ్రాట్స్
హైదరాబాద్: రూ.తొమ్మిది లక్షల స్థాయి నుండి హయ్యెస్ట్ పన్ను చెల్లింపుదారుగా కరప్షన్ కింగ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ట్విట్టర్‌లో విమర్శించారు.
తొమ్మిదేళ్లలోనే జగన్ తొమ్మిది లక్షల పన్ను చెల్లింపు స్థాయి నుండి దేశంలోనే అత్యంత పన్ను చెల్లింపుదారుల్లో మూడో వ్యక్తిగా ఎదిగారని పేర్కొన్నారు. జగన్‌ను కరప్షన్ కింగ్ అంటూ... అతను తన విజయ రహస్యాన్ని బయటకు చెబితే దేశంలో పేదరికం చరిత్రగా మిగిలిపోతుందని సెటైర్ వేశారు.

మరోవైపు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సంపదలో ఇంగ్లాండ్ రాణిని వెనక్కి నెట్టిన అంశంపై చంద్రబాబు నాయుడు పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు.
కాగా, 2011-12 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత విభాగంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మూడోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు సోనియా ప్రపంచంలోని ధనవంతులైన రాజకీయ నాయకుల జాబితాలో 12వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టించారు. 2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన సోనియా గాంధీ ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్-2, సిరియా అధ్యక్షుడు ఆల్ అసద్‌లను వెనక్కి నెట్టినట్లు హుఫింగ్టన్ పోస్ట్ వరల్డ్ తన నివేదికలో పేర్కొంది.












Click it and Unblock the Notifications