జ‌గ‌న్ బ్ర‌హ్మాస్త్రం ఇదే..గురి త‌ప్ప‌లేదు: చంద్ర‌బాబును కోలుకోలేని దెబ్బ తీసింది..!

Recommended Video

    AP Cm 2019 : ప్రత్యేక హోదా సాధిస్తాం కానీ : జగన్ || Oneindia Telugu

    ఎలాగైనా 2019 ఎన్నిక‌ల్లో గెల‌వాలి. అధికారం ద‌క్కించుకోవాలి. నంద్యాల ఫ‌లిత‌మే క‌సి పెంచింది. అప్పుడే డిసైడ్ అయ్యారు. అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ఏం చేయ‌గ‌ల‌రో. అంతే..వ్యూహాన్ని మార్చేసారు. చంద్ర‌బాబును మౌళికంగా దెబ్బ తీయాలి. ఆర్దిక బ‌లం లేదు. స‌మ‌ర్ద‌వంతమైన అంగ బ‌లం లేదు. ఉన్న‌ది గుండె బ‌లం మాత్ర‌మే. ఉన్న‌ది జ‌న బ‌లం మాత్ర‌మే. జ‌గ‌న్ రాజ‌కీయం పూల బాట‌. తొలి రోజు నుండి ముళ్ల‌బాటే. ఏ ప‌రిస్థితిలోనూ చెద‌ర‌ని మ‌నో నిబ్బ‌రం ..తండ్రి పంచిన తెగింపు ఆయ‌న‌ను రాటు తేల్చాయి. 40ఏళ్ల అనుభ‌వం ఒక వైపు.. కేసులు మ‌రో వైపు ఉక్కిరి బిక్కిరి అవుతూనే..రాజ‌కీయంగా ప‌దునైన అస్త్రాల‌ను ప్ర‌యోగించారు. అందులో బ్ర‌హ్మ‌స్త్రం నేరుగా చంద్ర‌బాబు పైన గురి పెట్టారు. అది గురి త‌ప్ప‌లేదు. చంద్ర‌బాబును కోలుకోలేని దెబ్బ తీసింది. అధికారం తెచ్చి పెట్టింది. మ‌ఖ్య‌మంత్రిని చేసింది.

    2014 నుండే ప్ర‌ణాళిక‌లు..

    2014 నుండే ప్ర‌ణాళిక‌లు..

    2014 ఎన్నిక‌ల్లోనే జ‌గ‌న్ గెలుపు ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ, రెండు శాతం ఓట్ల‌తో ఓడిపోయారు. అప్పటి నుండే జ‌గ‌న్ ఆ ఎన్నిక‌ల్లో త‌మ త‌ప్పిదాలు ఏంటో..అనుభ‌వ రాహిత్యం ఏంటో అర్దం చేసుకున్నారు. శాస‌న‌స‌భ‌లోనూ కొత్త కావ‌టంతో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. క్ర‌మేణా అంశాల వారీగా అవ‌గాహ‌న పెంచుకున్నారు. ఎదురుదెబ్బ‌లు తినే కొద్దీ రాటు తేలారు. అసెంబ్లీలో అధికార ప‌క్షాన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఇక‌, ప్ర‌భుత్వం పైన పోరాటం మొద‌లు పెట్టారు. అధికారంలోకి రావ‌టానికి చంద్ర‌బాబు ఇచ్చిన హామీలను ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. రైతులు..మ‌హిళ‌ల త‌ర‌పున తాను ఉన్నాన‌నే సంకేతాలిచ్చారు. త‌న పార్టీ నుండి ముగ్గురు ఎంపీల‌నున‌..23 మంది ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసి ఫిరాయింపులు ప్రోత్స‌హించిన చెక్కు చెద‌ర‌లేదు. చంద్ర‌బాబును ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించార. నంద్యాల ఫ‌లితం క‌సి పెంచింది. అంతే..అక్క‌డ మొద‌లైన ప్ర‌య‌ణం నేటి ఫ‌లితాల దాకా ఆగేలేదు.

    చంద్ర‌బాబును దెబ్బ తీసింది ఆ ఆస్త్ర‌మే..

    చంద్ర‌బాబును దెబ్బ తీసింది ఆ ఆస్త్ర‌మే..

    జ‌గ‌న్ రాజ‌కీయంగా కొన్ని పొర‌పాట్లు చేసినా..విలువ‌ల‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. త‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా మోసం చేసిన చంద్ర‌బాబు తీరును విసుగు లేకుండా ప్ర‌తీ సంద‌ర్భంలో వివ‌రించారు. చంద్ర‌బాబు మోసం చేసార‌నే అభిప్రాయం ప్ర‌తీ ఒక్క‌రిలో క‌లిగించారు. చంద్ర‌బాబు అవినీతిని ప్ర‌స్తావిస్తూ..త‌న పైన అవినీతి ఆరోప‌ణ‌ల గురించి మాట్లాడే అవ‌కాశం లేకుండా చేసారు. విలువ‌లు..విశ్వ‌స‌నీయ‌కు ప్రాధాన్య‌త ఇచ్చారు. అదే జ‌గ‌న్ చేతిలో బ్ర‌హ్మ‌స్త్రం గా మారింది. చంద్ర‌బాబు విశ్వ‌స‌నీత‌య లేని నాయ‌కుడ‌ని ఆయ‌న చేసిన ప‌నులతో స‌హా ప్ర‌తీ ఒక్క‌రికీ అర్ద‌మ‌య్యేలా వివ‌రించారు. అదే స‌మ‌యంలో త‌న తండ్రి త‌ర‌హాలోనే తాను విశ్వ‌స‌నీయ‌త‌కు ప్రాధాన్యాత ఇస్తానంటూ కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అదే స‌మయంలో చంద్ర‌బాబు ఇక ఏం చెప్పినా న‌మ్మ‌లేని ప‌రిస్థితి తీసుకురావ‌టంలో స‌క్సెస్ అయ్యారు.

    నిన్ను న‌మ్మం బాబు..స‌క్సెస్ ప్లాన్‌..

    నిన్ను న‌మ్మం బాబు..స‌క్సెస్ ప్లాన్‌..

    చంద్ర‌బాబు ఏం చెప్పినా చేయ‌ర‌ని..మోసం చేస్తార‌ని చెప్ప‌టానికి నిన్ను న‌మ్మంబాబు అని స్లోగ‌న్ తెర మీద‌కు తెచ్చారు. ఇక ప్ర‌జ‌ల్లోనూ చంద్ర‌బాబు చెబితే చేయ‌రు..జ‌గ‌న్ చెబితే మాత్రం అమ‌లు చేస్తార‌నే న‌మ్మ‌కం క‌లిగించారు.
    వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేల‌ను ఫిరాయించేలా చేస్తే..టీడీపీ నుండి వైసీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి స్వాగ‌తించ‌టంతో జ‌గ‌న్ విలువ ఒక్క సారిగా పెరిగిపోయింది. చంద్ర‌బాబు విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ తీసి త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకున్న జ‌గ‌న్‌...చంద్ర‌బాబు ఏం చెప్పినా న‌మ్మ‌లేని ప‌రిస్థితి క‌ల్పించ‌టంలో స‌క్సెస్ అవ‌ట‌మే ఈ ఎన్నిక‌ల్లో ఇంత విజ‌యాన్ని తెచ్చి పెట్టింది. ఇప్పుడు జ‌గ‌న్ త‌న విశ్వ‌స‌నీయ‌త నిరూపించుకొని భ‌విష్య‌త్‌లోనూ చంద్ర‌బాబు వైపు ప్ర‌జ‌ల చూపు మ‌ళ్ల‌కుండా ఎంత వ‌ర‌కు సక్సెస్ అవుతారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+