విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - రేపు స్కూళ్లు, కాలేజీల బంద్..!!
విద్యార్ధులకు కీలక అప్డేట్. రేపు (శుక్రవారం) అన్ని విద్యా సంస్థలు బంద్ కానున్నాయి. విద్యార్థి సంఘాలు 10వ తేదీన బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించటం సహా పలు విద్యారంగ సమ్యలను పరిష్కరించాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు నిర్ణయించాయి. దీంతో, రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రేపు (శుక్రవారం) విద్యా సంస్థలు బంద్ కానున్నాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న విద్యా సంబంధిత సమస్యల పరిష్కారం కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉమ్మడిగా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 27వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటి సంఖ్యను 4వేలకు తగ్గించాలని సర్కారు భావిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బంద్ కు అన్ని విద్యా సంస్థలు సహకరించాలని ఇప్పటికే సంఘాల నేతలు కోరారు.

విద్యార్ది సంఘాల డిమాండ్స్
అదే విధంగా రాష్ట్రంలో పలు పాఠశాలల్లో ఖాళీగా ఉన్నఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలు, హాస్టల్స్ , గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణం అమలు చేయాలని విద్యాహక్కు చట్టం అమలు చేసి అన్ని విద్యా సంస్థల్లో పేదలకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో విచ్చలవిడిగా పుస్తకాలు, నోట్ బుక్స్ విక్రయాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటించాలని నిర్ణయించాయి.












Click it and Unblock the Notifications