జగన్ తిరుమల పర్యటన, డిక్లరేషన్ రగడ.. అసలు మ్యాటరేంటంటే!
ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈనెల 28వ తేదీన ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతున్నారని జగన్ ఈ వారం షెడ్యూల్లో తిరుమల పర్యటన కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇక తిరుమలకు వైయస్ జగన్ వెళుతున్నారని వార్తల నేపథ్యంలో మరో మారు డిక్లరేషన్ పైన పెద్ద ఎత్తున రగడ కొనసాగుతోంది.
జగన్ తిరుమల డిక్లరేషన్ పై రగడ
తిరుమల పర్యటన లో ప్రతి పక్షంలోను, ముఖ్యమంత్రి హోదాలో వున్నా ఎప్పుడూ డిక్లరేషన్ పైన జగన్ సంతకం పెట్టలేదని, ఈసారి కూడా జగన్ తిరుమలకు వెళుతున్న క్రమంలో
డిక్లరేషన్ పై సంతకం చేస్తాడా !వివాదం చేస్తాడా! అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైయస్ జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి దర్శనానికి వెళ్తాడా ! లేదా అని చర్చ చేస్తున్నారు.

డిక్లరేషన్ పై సంతకం చెయ్యాలని చెప్తున్న టీటీడీ
డిక్లరేషన్ పై సంతకం లేకుండా జగన్ ను దర్శనానికి టిటిడి అనుమతించబోదని కూడా చెబుతున్నారు. టిటిడి నియమనిబంధనలు ప్రకారం జగన్ సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారని, జగన్ అన్యమతస్తుడు కావడంతో నే డిక్లరేషన్ ను టిటిడి కోరుతోందని కూడా ప్రచారమవుతోంది. ఇక జగన్ ఒకవేళ తిరుమలకు వెళితే
దేవుడు పై నమ్మకం ఉంటే సంతకం పెట్టి తీరాలని భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.
జగన్ తిరుమలను టార్గెట్ చేశారని ప్రచారం
ప్రముఖలు ఎవ్వరు వచ్చినా సంతకం చేసి దర్శనానికి వెళ్ళుతున్నారని, డెక్లరేషన్ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తున్నామని టీటీడీ చెబుతుందని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ తిరుమలను టార్గెట్ చేసుకున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా చిన్న సంఘటనలను భూతద్దం లో చూపించే విధంగా సొంత మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని కూడా పోస్టులు పెడుతున్నారు.
జగన్ తో పాటు భారతిని తీసుకు వెళ్తారా? చర్చ
ఒకవేళ జగన్ తిరుమలకు వెళితే తనతో పాటు సతీమణి భారతిని కూడా దర్శనానికి తీసుకువెళ్తారా? ఆలయంలో ప్రసాదాలను స్వీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసిన తర్వాత అక్షింతలు తలపై దులిపేసుకున్న జగన్ విడియో అప్పట్లో వైరల్ అయ్యిందని గుర్తు చేస్తున్నారు.
గతంలో సంఘటనలను గుర్తు చేస్తూ జగన్ టార్గెట్
శ్రీవారి ఆలయం లో తులాభారం వద్ద వైవి సుబ్బా రెడ్డి భార్య గతంలో జగన్ పర్యటన లో జగన్ రక్షక గోవిందా అంటూ నినాదాలు చేశారని ఆ నినాదాల పైన కూడా అప్పట్లో దుమారం కొనసాగిందని గుర్తు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటన పై సర్వత్ర ఉత్కంఠ చోటు చేసుకుందని, డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే దర్శనానికి అనుమతిస్తారు, లేదంటే నో అంటూ టిటిడి చెబుతోందని ప్రచారం చేస్తున్నారు.
జగన్ తిరుమల పర్యటనపై వైసీపీ క్లారిటీ
అయితే జగన్ తిరుమలకు వెళ్లడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. జగన్ తిరుమల పర్యటన పూర్తిగా అవాస్తవమని జగన్ పర్యటన వివరాలు ఏవైనా పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ప్రకటించడం జరుగుతుందని వారు చెబుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా తప్పని వైసిపి శ్రేణులు ఖండిస్తున్నారు.












Click it and Unblock the Notifications