కలలోను: జగన్‌పై చిరు, వంద కోట్లు ఎక్కడివి: రావుల

విజయనగరం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కలలో కూడా ముఖ్యమంత్రి కాలేరని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి శనివారం అన్నారు. ఆయన విజయనగరం జిల్లాలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

జగన్ కలలోను ముఖ్యమంత్రి కాలేరన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పదవిని అడ్డు పెట్టుకొని జగన్ కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని స్వాగా చేస్తారన్నారు. జగన్ ఏ రోజైనా శాశ్వతంగా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ములేకే 2004 నుండి పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు.

Jagan will not become CM: Chiranjeevi

వంద కోట్లు ఎక్కడివి: రావుల

కడప లోకసభ స్థానం నుండి పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అవినాష్ రెడ్డి తన బ్యాంకు ఖాతాలు, అందులోకి వచ్చిన రూ.100 కోట్ల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో చెప్పకుండా మోసగించారని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి ఆరోపించారు. అవినాష్‌కు మలేషియా, సింగపూర్, హాంకాంగ్ తదితర దేశాల్లో బ్యాంకు ఖాతాలున్నాయన్నారు.

అవినాష్ రెడ్డికి మలేషియా బ్యాంకు ఖాతాలోకి గత నవంబర్ 25న రూ.40 కోట్లు వచ్చాయని, ఈ సొమ్మును సింగపూర్లోని ఓ సిబిసి ఖాతా నుంచి రఘువరన్ మురళీ అనే వ్యక్తి అవినాష్ రెడ్డి ఖాతాలోకి పంపారని ఆరోపించారు. ఇదే రఘువరన్ మలేషియాలోని మరో బ్యాంకు ఖాతా నుండి గత డిసెంబర్ 15న అవినాష్‌కు ఉన్న హాంకాంగ్ బ్యాంకు ఖాతాలోకి మరో రూ.60 కోట్లు పంపారనన్నారు. ఇవన్నీ ఎక్కడివని, వీటిని ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదన్నారు. వీటిపై తాము ఈసికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+