స్టీఫెన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని జగన్ లేఖ, కేసీఆర్ తప్పించుకోలేరు: యనమల బాంబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం మరో బాంబు పేల్చారు! స్టీఫెన్ సన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ టీఆర్ఎస్‌కు లేఖ రాశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పటికే కేసీఆర్ కోటి రూపాయలు తీసుకొని స్టీఫెన్‌కు పదవి ఇచ్చారనే దుమారం చెలరేగుతోంది. తాజాగా యనమల... జగన్ లేఖ రాశారని చెప్పడం గమనార్హం.
యనమల శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జగన్ తెరాసకు లేఖ రాశారని, స్టీఫెన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పారన్నారు. టీఆర్ఎస్, జగన్ కుమ్మక్కై తమ పైన కుట్ర పన్నుతున్నారన్నారు. చంద్రబాబును అప్రతిష్టపాలు చేసే కుట్ర చేస్తున్నారన్నారు.

ఫోన్ ట్యాపింగ్ చేశామని తొలుత చెప్పిన తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి, మంత్రులు, ఇతర తెరాస నేతలు ఆ తర్వాత మాట మార్చారని గుర్తు చేశారు. ట్యాపింగ్ చేశామని హోంమంత్రి కూడా చెప్పారని, డీజీపీ మాత్రం ట్యాపింగ్ చేయలేదని చెప్పారన్నారు.
విభజన చట్టంలో సెక్షన్ 8 ఓ భాగమని చెప్పారు. సెక్షన్ 8 వద్దంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లేనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ ప్రభుత్వంలోని నేతలు తలోరకంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ పైన పక్కా ఆధారాలున్నాయన్నారు. దీని నుండి కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకోలేదన్నారు.
నేతలు హుందాగా వ్యవహరించాలి: జానా రెడ్డి
నేతలు హుందాగా వ్యవహరించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత జానా రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకిరంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటు వారికి చెప్పే నేతలు ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications