జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులు..ప్రజల్లో భారీ స్పందన..!

రాష్ట్రంలోని పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్‌ ఇటీవల పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సీఎం జగన్‌ చెప్పిన విధంగా ప్రస్తుతం ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పకడ్బంధీగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రభుత్వం ఆధ్వర్వంలో ఇంత భారీ స్థాయిలో మెడికల్‌ క్యాంపులు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ తరహాలో స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. దీంతో శిబిరాలకు కేవలం వృద్దులు మాత్రమే కాకుండా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, యువత తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు.

పరీక్షలు, మందులు క్యాంపుల వద్దే ఇస్తూ..
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో దాదాపు రక్తపరీక్షలతోపాటు వివిధ రోగాలను గుర్తించేలా సుమారు 53 రకాల పరీక్షలు చేస్తున్నారు. దీంతోపాటు 172 రకాల మందులను క్యాంపుల వద్ద ఇస్తున్నారు. ఇక ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 350 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లు సేవలందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పీహెచ్‌సీ పరిధిలోని వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది క్యాంపు వద్ద ఉంటున్నారు. దీంతోపాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతున్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి అవసరమైన చికిత్సలు చేయడంతోపాటు, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉంటే అలాంటి వారిని ఆరోగ్య శ్రీ కింద పనిచేస్తున్న ఆసుపత్రులకు ఆ రోగులను వైద్యులు పంపుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటీ ఉచితంగా అందజేయడంతో ప్రజలు ఆరోగ్య సురక్ష క్యాంపులకు భారీగా తరలి వస్తున్నారు.

Jagananna Aarogya suraksha aimed to give best treatment to poor gets huge response

టీబీ, లెప్రసీ టెస్టులు ప్రత్యేకంగా..
మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. శిబిరానికి వచ్చే ప్రజలకు పరీక్షలు చేసేందుకు రోజూ ఒక్క శిబిరంలో ఇద్దరి నుంచి నలుగురు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఇందులో ప్రాణాంతక వ్యాధి అయిన టీబీ, లెప్రసీ టెస్టులు ప్రత్యేకంగా చేపడుతున్నారు. రోగ లక్షణాలు కనిపిస్తే అక్కడే మందులను ఇస్తున్నారు. క్యాంపు తర్వాత కూడా వారికి మందులు, ఇతర ట్రీట్‌ మెంట్‌ ఇచ్చేలా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి కూడా ఒక స్పెషలిస్టు వైద్యుడు పాల్గొనడంతో ఈ సురక్ష క్యాంపులు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే తెలిపింది. ఇక ఆరోగ్య సురక్ష క్యాంపులను విజయవంతం చేసేందుకు గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

Jagananna Aarogya suraksha aimed to give best treatment to poor gets huge response

స్పెషలిస్టు వైద్యుల రాకతో సత్ఫలితాలు..
సాధారణంగా వైద్య శిబిరాల్లో జనరల్‌ మెడిసిన్‌ ఇచ్చే వైద్యులు ఎక్కువ మంది ఉంటారు. కానీ జగనన్న ఆరోగ్య సురక్షలో స్పెషలిస్టు వైద్యులు నలుగురు వరకు ఉంటున్నారు. ఇందులో ఆర్థో, గుండె, చిన్నపిల్లలు, గైనకాలజీ విభాగానికి చెందిన వైద్యులు ఎక్కువ మంది పాల్గొంటున్నారు. దీంతో సురక్ష క్యాంపు కాస్త ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వాతావరణాన్ని తలపిస్తోంది. రోగులు వైద్యులను సంప్రదించిన తర్వాత 20 నుంచి నెల రోజుల వరకు మందులను ఉచితంగా అందజేస్తున్నారు. శిబిరానికి వస్తున్న రోగులకు క్యాంపుల వద్దే భోజనం, మంచి నీరు కూడా అందిస్తున్నారు. దీంతోపాటు రోగులకు సాయం చేసేందుకు వాలంటీర్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా శిబిరాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+