గూగుల్ సెర్చ్: వైయస్ జగన్‌ వెనకే చంద్రబాబు, కెసిఆర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను వెనక్కి నెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గూగుల్ సెర్చ్‌లో ఎక్కువమంది నెటిజన్లచే వెతకబడిన నాయకుడిగా రికార్డు సృష్టించాడు. రాష్ట్రంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ట్రెండ్ ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

గత 90 రోజుల్లో డేటా సగటును సేకరించిన గూగుల్ ట్రెండ్ ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిలిచారని తెలిపింది. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు లను కూడా కొన్ని సంఖ్యల తేడాతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వెనక్కినెట్టారు.

కాగా, దేశంలో ఎక్కువ మంది నెటిజన్లు వెతికిన వారి జాబితాలో భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ రాజకీయ నాయకుల జాబితాలో అగ్ర స్థానంలో నిలవగా, తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రివాల్ కొనసాగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్య కేజ్రివాల్‌తో పోలిస్తే 2/3 వంతు, మోడీతో పోల్చితే సగం వరకు ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్, చంద్రబాబు నాయుడు, కెసిఆర్ గురించి సెర్చి చేసిన వారి సంఖ్యతో పోల్చితే నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ సెర్చి చేసిన వారి సంఖ్య అధికంగా ఉంది. ఇది హైదరాబాద్ నగరంలో మరీ ఎక్కువగా ఉంది. ఆశ్చర్యకరంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో కూడా రాష్ట్ర నాయకుల కంటే కూడా నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రివాల్ గురించి సెర్చించే వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

Jaganmohan Reddy most googled politician in Andhra Pradesh

చంద్రబాబు నాయుడు, కెసిఆర్ లాంటి నాయకులతో పోల్చితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఎక్కువగా వెతికినట్లు తెలుస్తోంది. అంతేగాక జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఆర్థిక నేరాభియోగాలు కూడా అతని గురించి వెతికేందుకు దోహదం చేసినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌లో పాపులారిటీ సంపాదించినంత మాత్రాన అవి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటేనని వారంటున్నారు. జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తోందని, ఇది కూడా అతని పాపులారిటీని పెంచడంలో సహకరించినట్లు తెలుస్తోందని వారు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+