ఏపీని ‘పెళ్లి కూతురు’లా చేస్తారు: చంద్రబాబుపై జగపతిబాబు ఆసక్తికరం

హైదరాబాద్: ప్రముఖ నటుడు జగపతిబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది పండగ రోజున ఓ మీడియా ఛానల్‌లో మాట్లాడిన ఆయనను 'రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా?' అని యాంకర్ ప్రశ్నించారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి లేదని జగపతిబాబు స్పష్టం చేశారు.

అయితే, తనకు చంద్రబాబునాయుడు అంటే ఎంతో అభిమానమని చెప్పారు. ఒక నాయకుడిగా చంద్రబాబుపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పరంగా కంటే కూడా ఒక వ్యక్తిగా చంద్రబాబు అంటే తనకు అత్యంత గౌరవమని చెప్పారు.

హైదరాబాద్‌ను చంద్రబాబునాయుడు.. పెళ్లి కూతురులా ముస్తాబు చేసిన విధానం తనకు ఎంతో నచ్చిందని జగపతిబాబు తెలిపారు.హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన తర్వాత దిగిపోయారని.. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను ఒక 'పెళ్లి కూతురు'లా ముస్తాబు చేయాలంటే అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని అన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.

Jagapathi Babu praises Chandrababu

అలాగే పార్టీ పరంగా తెలుగుదేశంకు ఎలాంటివి చేయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. గతంలో కూడా ప్రచార కార్యక్రమాలు చేశాననీ, కానీ, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి లేదని చెప్పారు.

తనకు రాజకీయాల్లో అసలు ఏమీ తెలియదని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చాయని.. కానీ, తెలియని రంగంలో తలదూర్చనని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+