టి: జగ్గారెడ్డి నచ్చారన్న పవన్, తెలంగాణలో ప్రతిపక్షంపై..

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సోమవారం కలిశారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి తాను పని చేస్తానని తెలిపారు. అయితే ఏవిధంగా ఆయనతో కలిసి పని చేసేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. పవన్ మాట్లాడుతూ... తెలంగాణలో బలమైన ప్రతిపక్షం అవసరమని చెప్పారు. తెలంగాణ విషయంలో జగ్గారెడ్డి వ్యవహరించిన తీరు తనకు నచ్చిందని చెప్పారు. తాను జగ్గారెడ్డితో కలిసి పని చేస్తానని తెలిపారు.

Jagga Reddy praises Pawan Kalyan

జగ్గారెడ్డి భావాలు తనకెంతో నచ్చాయన్నారు. ఒకవైపు తెలంగాణవాదం గురించి మాట్లాడుతూనే ఇరుప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం జగ్గారెడ్డి తపించారన్నారు. జగ్గారెడ్డి లాంటి వారు ప్రజలకు అవసరమన్నారు. జనసేన ద్వారా పని చేయాలా? లేక ఇతర పార్టీలతో కలసి పని చేయాలా? అనే విషయాన్ని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు.

పవన్‌ను కలిసిన మురళీ మోహన్

పవన్ కళ్యాణ్‌ను సోమవారం ఉదయం టిడిపి నేతలు మురళీ మోహన్, మాగంటి బాబు, బిజెపి ఎంపీ కంభంపాటి హరిబాబులు కలిశారు. టిడిపి-బిజెపి కూటమి విజయానికి కృషిచేసి, పూర్తి సహకారం అందించిన పవన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+