వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌తో భేటీపై జగ్గారెడ్డి ట్విస్ట్, మా కెసిఆరే... కోదండరాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jagga Reddy twist on Pawan Kalyan meeting.
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో భేటీ విషయమై సంగారెడ్డి మాజీ శాసన సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) ట్విస్ట్ ఇచ్చారు. శుక్రవారం జగ్గారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న స్నేహంతోనే ఆయనను కలిశానని జగ్గారెడ్డి చెప్పారు. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పైన తాను పొన్నాలతో చర్చించానని తెలిపారు.

పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ... జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారనేది అవాస్తవమన్నారు. వాస్తవికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని చెప్పారు. ఎక్కడి వారు అక్కడే పని చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. జెడ్పీ, ఎంపీపీలను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ వెలువడగానే తాము విప్ జారీ చేస్తామని చెప్పారు.

మా కెసిఆరే: కోదండరాం

తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ కెసిఆరేనని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా అన్నారు. తనకు కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ప్రచారం అవాస్తవమన్నారు. ప్రభుత్వం ఏర్పాటులో కెసిఆర్ బిజీగా ఉన్నారని, ఆయన మా కెసిఆరేనని, ఎప్పుడైనా కలుస్తామని కోదండ వ్యాఖ్యానించారు.

జూన్ 2న అపాయింటెడ్ డే నేపథ్యంలో 1వ తేదీ అర్ధరాత్రి జాతీయ జెండాలు ఎగురవేస్తామని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. జూన్ 2న అమరవీరులకు నివాళులు అర్పిస్తామన్నారు. సిఎం అమరవీరులకు నివాళులు అర్పించాకే తొలి సంతకం చేస్తారన్నారు. జూన్ 2న గగన్ విహార్‌లో ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని చెప్పారు.

English summary
Congress leader Jagga Reddy twist on meeting with Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X