చిన్న బెల్లం ముక్క... మీ జీవితాన్నే మార్చేస్తుంది!
వాయు కాలుష్యం వల్ల ప్రతి ఒక్కరు శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెల్లానికి ఇన్ఫ్లమేషన్‌తో పోరాడే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఒక బెల్లం ముక్క తినడంవల్ల శ్వాసకోశంలో మంట తగ్గుతుంది. కలుషితమైన గాలి వల్ల కలిగే లక్షణాల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
డిటాక్సీఫికేషన్ గుణాలు: బెల్లంలో సహజసిద్ధంగా డిటాక్సీఫికేషన్ గుణాలు ఉన్నాయి. క్లెన్సర్‌గా పనిచేసి శరీరంలో ఉండే అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. బెల్లం డిటాక్సీఫికేషన్ గుణాలు మన శరీరంలోని అన్ని విష పదార్థాలను తొలగిస్తాయి. దీనివల్ల కలుషిత వాతావరణంలో మరింత ప్రమాదానికి గురయ్యే ముప్పు తప్పుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వాయు కాలుష్యం శరీరానికి సంబంధించిన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తద్వారా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఐరన్, జింక్‌తో సహా వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలతో నిండిన బెల్లం తినడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు: ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉన్నాయి. వాయు కాలుష్యానికి గురైనప్పుడు ఫ్రీ రాడికల్స్ సంఖ్య పెరుగుతుంది. ఇవి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి.
రక్త శుద్ధి: బెల్లం తినడంవల్ల రక్తం శుద్ధి అవుతుంది. కలుషిత వాతావరణంలో జీవిస్తున్నప్పుడు రక్తంలో అదనపు వ్యర్థాలుంటాయి. వీటిని బెల్లం శుభ్రం చేస్తుంది. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. బెల్లం వాతావరణ కాలుష్యం నుండి రక్షించడంలో సహాయపడుతున్నప్పటికీ పూర్తిగా దానిపైనే ఆధారపడటం సరికాదు. కలుషిత గాలికి దూరంగా ఉండాలి. మంచినీరు సరిపడా తాగుతుండాలి. సమతుల్య ఆహారం తీసుకుంటుండాలి.












Click it and Unblock the Notifications