'జై సమైక్యాంధ్ర' ఫ్లెక్సీల కలకలం: వెనుక కిరణ్ రెడ్డియా?

విజయవాడ/గుంటూరు/న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రాంతంలో 'జై సమైక్యాంధ్ర' ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో జై సమైక్యాంధ్ర పేరుతో భారీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. దీంతో కొత్త పార్టీ పుట్టుకు వస్తుందనే ఊహాగానాలు మరింత ఊపందుకుంది.

సీమాంధ్రలోని పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన జై సమైక్యాంధ్ర ఫ్లెక్సీల్లో 'సమైక్యాంధ్ర మన విధానం - జై సమైక్యాంధ్ర మన నినాదం' అని ఉంది. వాటిలో తెలుగు తల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు తదితరుల ఫోటోలను పొందుపర్చారు. దీంతో ఈ ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే కొత్త పార్టీకి ఇది సంకేతం అంటున్నారు. ఇదే నినాదంతో కరపత్రాలను, పాటలను కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.

Jai Samaikyandhra Flexis in Seemandhra

దీని వెనుక ఎవరున్నారు?

'జై సమైక్యాంధ్ర' ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనే చర్చ గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ జై సమైక్యాంధ్ర పేరుతో కొత్త పార్టీ పెడుతున్నారని, దానికి గ్రౌండ్ వర్క్ విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ చేస్తున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్ ఉండవచ్చునని అంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వచ్చిన వారికి తెలియ చెప్పేందుకే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు.

రాజకీయ పార్టీలకు అంటకాగం: అశోక్ బాబు

తాము ఏ రాజకీయ పార్టీతోను అంటకాగడం లేదని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు బుధవారం స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలను ఢిల్లీలో ఎపిఎన్జీవో నేతలు కలిశారు. అనంతరం అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. విభజన ప్రక్రియ తీరులో భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు బిజెపి చెప్పిందన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవిస్తామని బిజెపి నేతలు చెప్పారన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించదని భావిస్తున్నామన్నారు.

అవసరమైతే తాము ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమైక్యాంధ్ర కోసం సుప్రీం కోర్టులోను పోరాడేందుకు సిద్దమన్నారు. జాతీయ పార్టీల నేతలను తాము మరోసారి కలుస్తామని, అలాగే ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర కాంగ్రెసు ఎంపీలను కలిసి ఏఐసిసి సమావేశంలో సమైక్యవాణి వినిపించాలని కోరుతామన్నారు. విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టమేనన్నారు. త్వరలో నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+