వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెదక్ నుంచి విజయశాంతి: పాలమూరుకు జైపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెసు అధిష్టానం తెలంగాణలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన తొలి జాబితా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన కాంగ్రెసు ఎన్నికల కమిటీ సమావేశంలో తొలి జాబితాను ఖరారు చేసినట్లు సమాచారం. 11 మంది లోకసభ సభ్యులకు, 55 మంది శాసనసభ్యులకు మరోసారి పచ్చజెండా ఊపింది.

అయితే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్థానాన్ని ఈసారి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చినట్లు తెలుస్తోంది. మిగిలిన పది మంది సిట్టింగ్ ఎంపీలు తమతమ స్థానాల నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఒ ఖమ్మం ఎంపీ స్థానాన్ని సిపిఐకి ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి ఆమె సిట్టింగ్ స్థానమైన మెదక్‌నే కేటాయించనున్నట్లు సమాచారం.

లోకసభ అభ్యర్థుల్లో జైపాల్ రెడ్డి (మహబూబ్‌నగర్), విజయశాంతి (మెదక్), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (భువనగిరి), పొన్నం ప్రభాకర్ (కరీంనగర్), బలరాం నాయక్ (మహబూబాబాద్), అంజన్‌కుమార్ యాదవ్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ (మల్కాజిగిరి), మధుయాష్కీ (నిజామాబాద్), గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ), సిరిసిల్ల రాజయ్య (వరంగల్), సురేశ్ షేట్కార్ (జహీరాబాద్) పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 Jaiapal Reddy shift from Chevella to Mahaboob nagar

హైదరాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, చేవెళ్ల, నాగర్ కర్నూల్ సీట్లను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం ఆశిస్తున్న విఠల్‌రావును దేవరకద్ర అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలని, చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని రంగంలోకి దించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

దానికి తోడు, 55 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు కాంగ్రెసు ఎన్నికల కమిటీ టికెట్లు ఖరారు చేసినట్లు సమాచారం. వర్ధన్నపేట స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్‌కే కేటాయించడమా లేక విజయ రామారావును రంగంలోకి దించడమా అనేది తేల్చుకోలేకపోతున్నారు. ఈ స్థానాన్ని సీపీఐ కూడా ఆశిస్తోంది. ఆలంపూర్, మహేశ్వరం, ఉప్పల్, ముషీరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్(రూరల్), నిజామాబాద్ (అర్బన్), కామారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.

నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీటుకు పిసిసి మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమారుడు సంజయ్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. కామారెడ్డికి ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఆయన కుమారుడిలో ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకోలేక పోతున్నారు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌రావును అక్కడి నుంచి చేవెళ్లకు మార్చవచ్చునని, శంకర్‌రావు కంటే ఆయన కుమార్తెకు టిక్కెట్ ఇచ్చేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుతోందని సమాచారం.

'కుటుంబంలో ఒక్కరికే అవకాశం అనే నిబంధన నుంచి తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.ఉత్తమకుమార్‌రెడ్డికి మినహాయింపు లభించింది. ఉత్తమ్ హుజూర్‌నగర్ నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. అదే విధంగా ఒకే ఒక దరఖాస్తు వచ్చిన కోదాడ నుంచి ఉత్తమ్ కుమార్ భార్య పోటీ చేసేందుకు అవకాశం లభించినట్లు చెబుతున్నారు.

English summary
It is said that union minister S jaipal Reddy may shift from Chevella to Mahaboobnagar. Meanwhile, Vijayashanti will contest from Medak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X