చీటింగ్: ఏపీ మాజీ మంత్రి షాకిర్, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కు జైలు శిక్ష
హైదరాబాద్: బ్యాంకును మోసం చేసిన కేసులో మాజీ మంత్రి, కదిరి నియోజకవర్గం నేత మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు సీబీఐ న్యాయస్థానం మంగళవారం నాడు జైలు శిక్ష విధించింది.
వీరిద్దరితో పాటు మరో ముగ్గురికి.. మొత్తం ఐదుగురికి న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. నిందితుల్లో బ్యాంకు మేనేజర్ కూడా ఉన్నారు.

కదిరిలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో వీరు రూ.10 కోట్లు చీటింగ్ చేసినట్లు కేసు నమోదయింది. రైతులకు మంజూరైన పంటల బీమాను, ఇన్‌పుట్ సబ్సిడీని వీరు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారుల సాయంతో బోగస్ ఖాతాలను తెరిచిన వీరు డబ్బు కాజేసినట్లు కేసు నమోదయింది. విచారణ జరిపిన కోర్టు కొద్దిసేపటి క్రితం శిక్షలను ఖరారు చేసింది.
వీరిని నిందితులుగా తేల్చిన న్యాయస్థానం షాకీర్‌కు రూ.5 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష, వెంకట ప్రసాద్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, షాకీర్ వైసిపి నేత కాగా, ప్రసాద్ టిడిపి నేతగా ఉన్నారు.












Click it and Unblock the Notifications