సరదాగా నడుచుకుంటూ.. రికార్డులు బద్దలు బద్దలు
జైలర్ సినిమాను చూసిన తర్వాత ఇందులో ఏముందబ్బా అంత ప్రత్యేకత.. ఎందుకు అంత ఆడుతోంది? రికార్డులు బద్దలవుతున్నాయే.. చాలా ఆశ్చర్యంగా ఉందే అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సినిమాకు వస్తున్న వసూళ్లకు, సినిమాలోని కంటెంట్ కు అసలు పొంతనే కుదరడంలేదు. సాధారణంగానే సినిమా ఉన్నప్పటికీ అన్ని రికార్డులు బద్ధలవడానికి మాత్రం కారణం రజనీ చరిష్మా.
సినిమాలో రజనీకాంత్ ఎలివేషన్ సీన్లు, అనిరుధ్ రవిచందర్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. జస్ట్ యావరేజ్ సినిమాకే సూపర్ స్టార్ రికార్డుల మోత మోగిస్తుండటంపై దేశవ్యాప్తంగా ట్రేడ్ వర్గాలు ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గత సినిమాల ఫలితాలను చూస్తే జైలర్ సినిమాపై కూడా ఎవరికీ అంత హోప్ లేదు. రజనీ పనైపోయిందని కామెంట్ చేసినవారికి ఈ వసూళ్లు సునామీలాంటి షాక్.

వాస్తవానికి చరిత్రలో నిలిచిపోయేంత పాత్ర కాదు.. అంత నటన కాదు.. అవేవీ జైలర్ లో లేవు. కానీ రజనీ ఏం చేశారంటే.. స్లో మోషన్ లో నడుచుకుంటూ వచ్చారు. ఏ సినిమాలో అయినా హీరోకు ఇంట్రో సీన్ ఉంటుంది. కానీ జైలర్ లో రజనీకి ఇంట్రో లాంటి సీన్లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఒక ఎపిసోడ్ అయిపోవడం.. చిన్న బ్రేక్ తీసుకొని స్టైల్ గా నడుచుకుంటూ రావడం.. వెనక అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మోత మోగిస్తుండటం.. ఇలాంటివి వేరే హీరో అయితే చికాకు పుట్టించేవి. కానీ రజనీకాంత్ ఎన్నిసార్లు ఇలా చేసినా అభిమానులకు బోర్ కొట్టదు. సగటు ప్రేక్షకుడికి కూడా బోర్ కొట్టదు. ఆ సీన్లే కిక్కిచ్చాయి.
సినిమా విడుదలైన సమయం కూడా రజనీకి బాగా కలిసి వచ్చింది. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం.. దక్షిణ భారతదేశ బాక్సఫీస్ లో రెండువారాలుగా దీనికి ఎదురేలేకుండా పోతోంది. అన్ని రాష్ట్రాల్లో ఆల్ టైం తమిళ సినిమాల ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళుతోంది. అమెరికాలో 5 మిలియన్ క్లబ్ లోకి అడుగుపెట్టబోతోంది. అక్కడ కూడా రికార్డు జైలర్ దే అవబోతోంది. రజనీ 2.ఓ పేరుతో ఉన్న వసూళ్ల రికార్డునే దాటాల్సి ఉంది. ప్రస్తుతం జైలర్ పరిస్థితిని చూస్తే అది కూడా లాంఛనమే అని చెప్పవచ్చు. రజనీకాంత్ ఇలా నడుచుకుంటూ వచ్చి అన్ని రికార్డులను లేపేశాడంటూ అభిమానులు మాములు ఎలివేషన్లు ఇవ్వడంలేదు.












Click it and Unblock the Notifications