Jailer Vs Bhola Shankar: సూపర్ స్టార్ ముందు తేలిపోయిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరూ కూడా అగ్ర హీరోలే. తెలుగులో చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండగా, తమిళంలో రజనీకాంత్ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఇద్దరికి 60 ఏళ్ల వయస్సు దాటినప్పటికీ కూడా తమ నటనతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ నటించిన రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌తో విడుదలైయ్యాయి. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్' సినిమాలో రజనీకాంత్ హీరోగా నటించారు.

ఈ సినిమా గత గురువారం విడుదలైంది. ఇక మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇద్దరు అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఒకటి తరువాత మరొకటి విడుదల కావడంతో.. ట్రెడ్ వర్గాల్లో మంచి వాతవరణం కనిపించింది. అయితే రజనీకాంత్ నటించిన 'జైలర్' మొదటి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. చాలాకాలం తరువాత రజనీకాంత్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఆయన అభిమానులు ఆనందానికి అడ్డే లేకుండా పోయింది.

Jailer Vs Bhola Shankar:

'జైలర్' సినిమా తొలి ఆట నుంచి వసూళ్ల సునామీని సృష్టిస్తోంది.ఈ సినిమా మొదటి రోజునే 75 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా నిర్మాతలు ప్రకటించారు. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటేసింది. ఫుల్ రన్‌లో జైలర్ సినిమా 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు.రజనీకాంత్ 'జైలర్' సినిమా పరిస్థితి ఇలా ఉంటే...దానికి పూర్తి విరుద్దంగా చిరంజీవి 'భోళా శంకర్' సినిమా కొనసాగుతుంది. భోళా శంకర్ సినిమా మొదటి షోకే మిక్స్‌డ్ టాక్ రావడంతో.. రెండో రోజు చాలా థియేటర్లలో ఖాళీ సీట్లు దర్శనం ఇచ్చాయి.

Jailer Vs Bhola Shankar:

దాదాపు 50 శాతం కలెక్షన్లు డ్రాప్ అయినట్టుగా సమాచారం. సిస్టర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్, తమన్నా, సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'భోళా శంకర్‌'కు మిక్స్‌డ్ టాక్ రావడంతో..ప్రేక్షకులు రజనీకాంత్ 'జైలర్' సినిమాకు క్యూ కడుతున్నారు. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ముందు .. మెగాస్టార్ చిరంజీవి సినిమా తేలిపోయినట్టుగానే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+