తెలంగాణలో నా పాత్ర చాలా కీలకం: జైపాల్ రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కలను సార్థకం చేసుకోవడంలో తన పాత్ర అత్యంత కీలకమైందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గురువారం అన్నారు. ఎంతో అనుభవం ఉన్న తనను మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే పాలమూరును ఎంతో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.

నల్గొండ మండలంలో కోమటిరెడ్డి ప్రచారం

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

 Jaipal Reddy claims Telangana

కూకట్‌పల్లిలో అభివృద్ధి జరిగింది: జెపి

కూకట్‌పల్లిలో రూ.1550 కోట్ల అభివృద్ధి జరిగిందని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులో అన్నారు. ప్రచారంలో భాగంగా మూసాపేట్‌లో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మరే నియోజకవర్గంలోనూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు.

నేతలతో భన్వర్‌లాల్ సమావేశం

అన్ని రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ గురువారం సమావేశమయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై వారు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+