టి కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్: ప్రతీ జిల్లాకు లక్ష జాబ్స్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో శనివారం విడుదలైంది. కేంద్ర మంత్రి జైరాం రమేష్, తెలంగాణ పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మేనిఫెస్టోను గాంధీభవన్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
జూన్ 2న తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా గుర్తింపు
మూడేళ్లలో ప్రతి జిల్లాకు లక్ష ఉద్యోగాలు
అమరవీరుల కోసం రూ. 100 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ ట్రస్ట్ ఏర్పాటు
వ్యవసాయానికి పగటిపూట 7 గంటల విద్యుత్
ఆరోగ్యశ్రీ తరహాలో మరింత పారదర్శకంగా ఆరోగ్య విధానం
సాంకేతిక విద్యార్థులకు ఉపాధి లభించేవిధంగా శిక్షణ
నల్గొండ, ఖమ్మం సరిహద్దుల్లో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక జోన్ ఏర్పాటు
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా
బెల్టు షాపులు రద్దు చేస్తాం
లంబాడా తండాలకు పంచయతీ హోదా కల్పిస్తాం
బిసి యాక్షన్‌ప్లాన్ అమలు
తెలంగాణలో 8 నుంచి 10 జిల్లాల ఏర్పాటు
విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు నామమాత్రపు వడ్డీ రుణాలు
స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ ఏర్పాటు
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం.
వృద్ధులు, వింతతు పెన్షన్‌లు వెయ్యికి పెంపు
ప్రతి జిల్లాలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు
వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్ పోస్టుల భర్తీ
ఎస్సి, ఎస్టి, ఓబిసి, మైనార్టీ పట్టభద్రులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వరకు రూ.10 వేల భృతి
ముస్లిలకు బిసి ఈ కేటాగిరిలో చేరుస్తాం
గ్రామాల్లో ఇళ్లులేని వారికి పది సెంట్ల భూమి
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
మైనార్టీకి సబ్‌ప్లాన్ అమలు చేస్తాం.
సబ్సీడీ సోలార్ ఆధారిత పంపుసెట్టు అందజేస్తాం.
సింగరేణిలో వీఆర్ఎస్ పునరుద్దరణ
సింగరేణిలో ఉద్యోగాలు స్థానికులకే.
బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ ప్రమోట్ చేసేందుకు చర్యలు
ఒలంపిక్ గేమ్ నిర్వహణే లక్ష్యంగా మౌలిక వసతులు
పోలీస్‌శాఖలో సంస్కరణలు
రాష్ట్ర పండుగలుగా బతుకమ్మ, మేడారం జాతర
గల్ఫ్ వెళ్లే వారికి భీమా సదుపాయం
గల్ఫ్‌లో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా












Click it and Unblock the Notifications