మీరే లేఖ ఇచ్చారుగా: బాబుకు జైరాం దిమ్మతిరిగే షాక్, కంగుతిన్న సీఎం!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మంగళవారం గట్టి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాలులో పలువురు నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయనకు జైరాం పార్లమెంటు సెంట్రల్ హాలులో ఎదురుపడ్డారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, జైరాం రమేష్‌లు చేతులు కలిపారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని మీరే విభజించారని అన్నారు. దానికి జైరాం గట్టి కౌంటర్ ఇచ్చారు.

మీరు రాష్ట్రాన్ని విభజించాలని లేఖ ఇచ్చారని, ఆ తర్వాతే విభజన జరిగిందని చెప్పారు. జైరాం సమాధానంతో చంద్రబాబు ఖంగుతిన్నారని తెలుస్తోంది. ఆ తర్వాత, మళ్లీ కలుద్దామని జైరాం అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం.
కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఉదయం పార్లమెంటుకు చేరుకున్న ఆయన ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నమస్కరించి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంటు ద్వారానికి నమస్కరించి లోనికి వెళ్లారు.
అనంతరం పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. అన్నాడీఎంకే నేత వేణుగోపాల్, ఎన్సీపీ నేతలు శరద్ పవార్, సుప్రియా సూలె, తారిక్ అన్వర్, టీఎంసీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, డెరిక్ ఒబ్రెయిన్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, టీఆర్ఎస్ నేత జితేందర్ రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు.
విభజన చట్టం అమలుపై 72 పేజీల నివేదికను వారికి అందజేశారు. విభజన చట్టంలోని అంశాలు, హోదా సహా కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతిచ్చిన పార్టీల నేతలకు చంద్రబాబు కృ,తజ్ఞతలు భవిష్యత్తులోనూ తమకు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications