జగన్‌తోనే ఇబ్బంది, వినడు: చంద్రబాబులా కాదని జలీల్ ఖాన్

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శలు ఎక్కుపెట్టారు. విజయవాడలో గురువారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమనే అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు.

కానీ, తాను ఇంత వరకు ఆయన అపాయింట్‌మెంట్ తీసుకోకుండానే కలుస్తున్నట్లు జలీల్ ఖాన్ తెలిపారు. అపాయింట్‌మెంట్ లేకుండా చంద్రబాబును కలవవచ్చు కానీ.. జగన్‌ను కలవడం అసాధ్యమని అన్నారు.

 jaleel khan fires at ys jagan

తాను చాలా సార్లు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నించానని, కానీ అది కుదరలేదని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఈ సారి ఆ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలెవరికీ జగన్ టికెట్లు ఇవ్వరని ఆయన అన్నారు.

కనీసం పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఆయన టికెట్ ఇవ్వరని ఆయన పేర్కొన్నారు. జగన్ ఏదనుకుంటే అదే చేస్తారని, ఎవరి మాటా వినరని ఆయన విమర్శించారు.

ఇది ఇలా ఉండగా, తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. పోయేవారు పోతేనే పార్టీ బాగుపడుతుందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+