గంటకుపైగా లిఫ్ట్‌లో ఇరుక్కున్న కేశినేని నాని, జలీల్ ఖాన్, వారిపై నేతల ఆగ్రహం
విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు శుక్రవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ప్రారంభించిన లిఫ్ట్‌లోనే.. వారు గంటకు పైగా ఇరుక్కు పోయారు. అంతసేపు వారు లిఫ్టులోనే గడవలసి వచ్చింది.
ఈ సంఘటన ఈ రోజు పాతనగరంలోని ముస్లీం షాదీఖానాలో జరిగింది. షాదీఖానాకు లిఫ్ట్ లేకపోవడంతో కొత్త లిఫ్ట్ ఏర్పాటు చేసారు. దీనిని జలీల్ ఖాన్, కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం అదే లిఫ్టులో పైఅంతస్థుకు వెళ్లేందుకు నేతలు ఎక్కారు.

పరిమితంగా ఎక్కినప్పటికీ లిఫ్టు మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వారు చాలాసేపు లిఫ్టులో ఉండవలసి వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది మరమ్మతులు చేసి లిఫ్టును తెరిచారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు రావడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. నిర్వాహకులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications