'ఎమ్మెల్యేలు జగన్‌కు అందుకే దూరమౌతున్నారు.. ఇదీ కారణం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న నాయకత్వ లక్షణాలు వైసిపి అధినేత జగన్‌కు లేవని మాజీ వైసిపి నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆదివారం నాడు మండిపడ్డారు. వైసిపిలో ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం లేదని చెప్పారు.
రాజీనామాకు సిద్ధమని, తన పైన సవాల్ చేసిన వైసిపి నేతల పైన గెలుపొంది తన సత్తా చూపిస్తానని చెప్పారు. చంద్రబాబు పాలన పైన నమ్మకంతోనే వైసిపి ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. తనను టార్గెట్ చేసి జగన్ తన పత్రికలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

జగన్ వైఖరి వల్లే: కళా వెంకట్రావు
ప్రతిపక్ష నేత జగన్ వైఖరి వల్లే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టిడిపిలోకి పెద్ద ఎత్తున వస్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. వైసిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు చేయూతనివ్వాలన్న ఉద్దేశ్యంతోనే వైసిపి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వస్తున్నారని చెప్పారు. వారందరినీ తమ కుటుంబం సభ్యుల్లా చూసుకుంటామని చెప్పారు. అందుకే టిడిపిలో చేరుతున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications