బట్టలూడదీసి కొడితే: కేవీపీపై జలీల్, 20 మంది వెళ్లినా జగన్ అడగలేదు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన టిడిపి నేత, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బుధవారం నిప్పులు చెరిగారు. ఇద్దరి పైన ఆగ్రహంతో ఊగిపోయారు.

నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!

వైయస్ జగన్, కేవీపీ రామచంద్ర రావుల పైన జలీల్ ఖాన్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. వందమంది జగన్‌లు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు.

jaleel khan

వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ రక్తపుటేరులు పారించిన పులిచింతల కాలువలో చంద్రబాబు మంచి నీరు పారిస్తున్నారన్నారు. ఇరవై మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా, జగన్‌ ఎందుకు వెళ్లారో అడగలేదన్నారు.

ప్రతిపక్షనాయకుడిగా జగన్ ఉండడం దురదృష్టకరమన్నారు. దోపిడీలో కేవీపీ రామచంద్ర రావు నెంబర్ వన్ వ్యక్తి అన్నారు. కేవీపీని బట్టలూడదీసి కొడితే ఎంత దోచుకున్నాడో బయటపడుతుందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jalel Khan shocking comments on YS Jagan and KVP Ramachandra Rao.
Please Wait while comments are loading...