టీడీపీలోకి ఎప్పుడొస్తున్నావ్?.. వైసీపీలో ఉంటే రోజాలా ఇబ్బందులే: జలీల్

టీడీపీలో చేరితేనే మేలని.. వైసీపీలో ఉంటే రోజాలా ఇబ్బందిపడుతావని వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాతో జలీల్ ఖాన్ చమత్కారం చేశారు.

అమరావతి: ఎమ్మెల్యేగా కూడా రాని గుర్తింపును ఒకే ఒక్క స్టేట్‌మెంట్ ఓవర్ నైట్ ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ చేసింది. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు, మన ఎమ్మెల్యేల తీరు ఇది! అంటూ టీవీల్లో పలు చర్చా కార్యక్రమాలు నడిచాయి.

తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత కప్పిపుచ్చే ప్రయత్నం చేసుకున్నా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. సరే, ఆ సంగతెలా ఉన్నా తాజా అసెంబ్లీ సమావేశాల్లో జలీల్ ఖాన్ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కనిపిస్తున్న నేతలనల్లా పలకరిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

Jalil khan interesting comments with MLA mustafa

నేటి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన జలీల్ ఖాన్.. వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫాతో మాటలు కలిపారు. అంతేనా!.. మా పార్టీలోకి ఎప్పుడొస్తున్నావ్?.. అంటూ సలహా కూడా ఇచ్చారు. టీడీపీలో చేరితేనే మేలని.. వైసీపీలో ఉంటే రోజాలా ఇబ్బందిపడుతావని జలీల్ ఖాన్ చమత్కారం చేశారు. టీడీపీలో చేరిన తర్వాత తన నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు రూ.300కోట్ల నిధులను మంజూరు చేశారని ముస్తఫాతో చెప్పారు.

వైసీపీ అంత బలంగా లేదని, క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం కావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేకపోయినా.. అధికారంలోకి రావాలని మాత్రం వైసీపీ కలలు కంటోందని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారని, మంత్రిపదవి కోసం తాను టీడీపీ గూటికి రాలేదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+