"దేవర" విడుదల వేళ అనూహ్య పరిణామం..!!

ప్రపంచ వ్యాప్తంగా దేవర విడుదలకు సిద్దమైంది. మరి కొద్ది గంటల్లో దేవర అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఆరేళ్ల తరువాత జూ ఎన్టీఆర్ సినిమా విడుదల వేళ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ ఫ్యాన్స్ ఉత్కంఠగా దేవర పండుగకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే విశాఖ కేంద్రంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బామ్మ జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టి అంచనాలను మరింత పెంచింది. తాజాగా విశాఖ కేంద్రంగా దేవరకు ఒక డిమాండ్ తెర ముందుకు వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం సెగ తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 'దేవర' మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.

Jana Jagarana Samithi seek devara support for Viskaha steel plant protest

విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో దేవర సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్' నినాదాల పోస్టర్లను జన జాగరణ సమితి నేతలు అతికించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. దేవర సినిమా పోస్టర్లపై 'సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' అనే నినాదాలతో ఉన్న పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.దీంతో, ఈ వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తారా.. లేదా అనేది కార్మిక సంఘాలు వేచి చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+