కెసిఆర్ మా కక్ష్యలోకే: జానా, 200 కోట్లు ఎవరిస్తే: దిలీప్

Jana Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి దూసుకుపోతుందని భావిస్తే భావించనీయండని, తమ పార్టీ కక్ష్య విశాలమైనదని, తెరాస ఈ కక్షలోకి రావాల్సిందేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి సోమవారం అన్నారు. 128 ఏళ్ల కాంగ్రెస్ ఇన్నాళ్ల చరిత్రలో ఎన్నో గెలుపోటములను చవి చూసిందని, మళ్లీ ఇప్పుడు క్లిష్ట సమయంలో ఉందంటున్నారని, అదీ చూద్దామన్నారు.

కొందరు మీ డియా ప్రతినిధులు సంకుచిత ధోరణితో ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు బాలూనాయక్, భిక్షమయ్య గౌడ్, చిరుమర్తి లింగయ్యలు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సన్నిహితులని చిత్రీకరిస్తున్నారని కానీ, వారంతా తన క్షేమాన్ని కోరుకునే మనుషులన్నారు. శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ప్రచారం ఒట్టిదే అన్నారు.

ప్రస్తుత రాజకీయ ధోరణులను చూస్తుంటే వీటి నుంచి తప్పుకోవాలన్న భావం కలుగుతోందన్నారు. తాను ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని, ఎవరు ముఖ్యమంత్రి అయినా తాను సహకరిస్తానని చెప్పారు. తన పట్ల మీడియా విశాల దృక్పథంతో ఆలోచించాలని, సంకుచిత ధోరణి తగదన్నారు.

రూ.200 కోట్లు ఎవరిస్తే వాళ్ల దగ్గరకు..!

కాంగ్రెస్, బిజెపిల్లో ఎవరు తొందరగా రూ.200 కోట్లు ఇస్తే, వాళ్ల దగ్గరికే కెసిఆర్ వెళ్తారని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్, బిజెపిలను చెరో 200 అడిగాడని, ఎవరిస్తే వాళ్ల దగ్గరికి కెసిఆర్ వెళ్తారన్నారు. విలేకరులు.. రూ.200 లక్షలా అని ప్రశ్నించారు.

కెసిఆర్ ఎకరం పంట మీదనే ఒక కోటి రూపాయలు సంపాదిస్తున్నానని చెబుతున్నారని, అలాంటిది రూ.200 లక్షలు ఎందుకు అడుగుతారని, ఆయన అడిగింది రెండువందల కోట్లు అన్నారు. ఏ పార్టీ ముందుగా ఇస్తే, వారి పంచన కెసిఆర్ చేరటం ఖాయమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+