త్వరలో పవన్ కళ్యాణ్ టాక్ షో!: ఎందుకు, జనసేనకు ఎలా ఉపయోగం?
Recommended Video

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి, రాజకీయాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఏపీలో పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ త్వరలో పునఃప్రారంభించనున్నారు. వెండి తెరపై పవన్ తిరుగులేని కథానాయకుడు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
చదవండి: హిందూపురంలో సర్వే, ఉద్రిక్తత: 'వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ఓటమి ఖాయం'
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వైపు రాజకీయాల్లో బీజీగా ఉంటూనే పవన్ ఓ టీవీ షోను చేయబోతున్నారని తెలుస్తోంది. సత్యమేవ జయతే వంటి ప్రోగ్రాంను ఆయన చేయనున్నారని అంటున్నారు.
చదవండి: మేం ఒంటరికాదు, మాకు పవన్ కళ్యాణ్ దొరికారు: బాబు-జగన్‌లపై తీవ్రవ్యాఖ్యలు

ఆ షో ఎందుకంటే?
ఈ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలోని సమస్యలను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపనున్నారని తెలుస్తోంది. ఈ షో వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పాటు త్వరలో ఎన్నికలు ఉండటంతో ఈ షో పై చర్చలు సాగుతున్నాయా లేక నిజంగానే ప్రారంభమవుతుందా అనే చర్చ కూడా సాగుతోంది.

పవన్‌కు ఈ షో ఎలా ఉపయోగపడుతుంది?
తన జిల్లాల పర్యటనలో పవన్ కళ్యాణ్ స్థానిక సమస్యలను లేవనెత్తుతూ వారిని ఆకట్టుకుంటున్నారు. ఆయన లేవనెత్తే సమస్య అర్థవంతంగా ఉండటంతో పాటు సమస్యలపై సరైన విధంగా స్పందిస్తున్నారని అంటున్నారు. అయితే ఇలా పర్యటిస్తే కొత్తగా పెట్టిన ఆయన పార్టీ అందరికీ చేరడం అసాధ్యం. ఆయనకు స్టార్ ఇమేజ్ కూడా ఉంది. ఈ షో ద్వారా ఆయన రాజకీయంగా అందరికీ మరింత దగ్గర అవుతారని అంటున్నారు.

షో ద్వారా మరింత ప్రజల్లోకి
తమిళనాడులో కమల్ హాసన్ రాజకీయ పార్టీని ప్రారంభించారు. అదే సమయంలో బిగ్ బాస్ షోను ప్రజల్లోకి వెళ్లేందుకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా టాక్ షో చేస్తారని భావిస్తున్నారు. ఇలా చేస్తే ప్రజల్లోకి మరింత బాగా వెళ్లవచ్చునని అంటున్నారు.

త్వరలో ప్రసారమయ్యే ఛాన్స్
ఈ షో 99న టీవీ ద్వారా ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఛానల్‌ను జనసేన కోర్ మెంబర్ కొనుగోలు చేశారు. కాగా, గతంలో జనసేనలో చేరిన ముత్తా గోపాలకృష్ణ కూడా ఈ అంశంపై జనసేనానితో చర్చించారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications