వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తమ్ముడు' ట్రావెలింగ్ సోల్జర్, పాచిపోయిన లడ్డూ: ఆల్బమ్‌తో 'ప్రత్యేక' నిరసన (ఆడియో)

ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు జనసేన ఆల్బమ్ విడుదల చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు జనసేన ఆల్బమ్ విడుదల చేశారు. 'తమ్ముడు' సినిమాలోని ట్రావెలింగ్ సోల్జర్ ఆడియో ట్రాక్.. ఆల్బంలో మొదటి పాటగా జనసేన విడుదల చేసింది.

దేశ్ బచావో పేరుతో ఈ ఆల్బమ్ విడుదల చేశారు. డీజే పృథ్వీతో ఈ ఆల్బమ్ రూపొందించారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించారు. దానిని జనసేన యూట్యూబ్‌లో ఉంచారు.

<strong>దేశ్ బచావో!: 'నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో'</strong>దేశ్ బచావో!: 'నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో'

తిరుపతిలో ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా, అలాగే, తాను ప్యాకేజీపై చేసిన పాచిపోయిన లడ్డూలు వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ ఆడియోలో మిక్స్ చేశారు. దేశ్ బచావో ఆల్బమ్ 3.11 నిమిషాల వ్యవధి కలిగి ఉంది. మ్యూజిక్ ఆల్బమ్ ద్వారా నిరసన తెలిపింది.

తమ్ముడి సినిమాలోని 'ట్రావెలింగ్ సోల్జర్', జానీ సినిమాలోని 'నారాజు గాకుర', ఖుషీ సినిమాలోని 'యే మేరా జహా', బాలు సినిమాలోని 'లేలే' పాట రిమీక్స్‌లను విడుదల చేశారు. ప్రత్యేక హోదా కోరుకుంటూ ఈ పాటలను రిమీక్స్ చేశారు.

ప్రత్యేక హోదాకు మద్ధతుగా 'మేము పూల గుత్తులు వ్రేలడే వసంత రుతువులం కాదు వట్టి మనుష్యులం! దేశం మాకు గాయలిచ్చినా నీకు మేము పువ్వులిస్తున్నాం.. ఓ ఆశచంద్రికల కుంభవృష్టి కురిశే మిత్రమా... యోచించి ఏమి తెస్తావో.. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రం దాటావు' అనే శేషేంద్ర పలుకులను పవన్ అంతకుముందు ట్విట్టర్లో పేర్కొన్నారు.

ఆర్కే బీచ్‌కు వస్తున్నానని చెప్పిన మొదటి హీరో..

ప్రత్యేక హోదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో జరగనున్న నిరసన ప్రదర్శనకు తాను రానున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. విశాఖకు తన టిక్కెట్ కన్‌ఫర్మ్ అయిందని, పేర్కొన్నారు. గెలిచే దాకా పోరాడుదామని, ప్రత్యేక హోదా తీసుకొద్దామని పేర్కొన్నారు.

English summary
Jana Sena released Desh Bachavo music album on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X