JANASENA MLA సెటిల్‌మెంట్ వీడియో లీక్! ఇసుక డబ్బుల లెక్కలు దగ్గరుండి మరీ...
పోలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల రాజకీయం తీవ్ర వేడి రాజేస్తోంది. స్థానికంగా నాయకుల మధ్య సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణా పంపకాల గొడవలు నేరుగా వీధికెక్కడం, దానికి తోడు స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి పంచాయితీలు చేయడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారీ తీసింది. స్థానిక నేతల మధ్య మొదలైన లక్షల రూపాయల డీలింగ్స్‌ను శాసనసభ్యుడే దగ్గరుండి సెటిల్ చేయడం, ఆ వీడియోలు బయటకు రావడం జనసేన వర్గాల్లోనే పెద్ద దుమారం రేపుతోంది.
ఇసుక, మట్టి సెటిల్మెంట్ లీక్.. సోషల్ మీడియాలో వీడియో రచ్చ!
కొయ్యలగూడెం ప్రాంతంలో జనసేన నేతకు, ఎమ్మెల్యే సన్నిహితురాలైన ఒక మహిళకు మధ్య మట్టి, ఇసుక తవ్వకాల వాటాల పంపిణీపై తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తన వాటా డబ్బులు తనకు ఇవ్వాలంటూ సదరు మహిళ రచ్చకెక్కడంతో ఈ వివాదం నేరుగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వద్దకు చేరింది. అయితే సమస్యను సర్దుమణగజేయాల్సిన ఎమ్మెల్యే.. రూ. 13 లక్షల గొడవలో స్వయంగా భాగస్వామి అయి అందరినీ కూర్చోబెట్టి నగదు పంపకాలను సెటిల్ చేశారు.

ఫోన్‌లో ఒక వ్యక్తితో మాట్లాడుతూ "రూ. 20 లక్షలు, రూ. 30 లక్షలు వచ్చినప్పుడు డీజిల్‌కు, డ్రైవర్లకు ఎందుకు ఇవ్వడం లేదు?" అని ఎమ్మెల్యే ప్రశ్నించిన ఆడియో, వీడియో సంభాషణలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. 2024 ఎన్నికల వేళ కారు కొనుక్కోవడానికి కూడా స్థానికుల నుంచి చందాలు సేకరించిన ఎమ్మెల్యే, నేడు ఏకంగా లక్షల రూపాయల పంచాయితీలు చేస్తూ దొరికిపోవడంపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
మట్టి మాఫియాకు అండగా జనసేన ఎమ్మెల్యేమట్టి తవ్వకాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, దగ్గరుండి నగదు పంపకాలు చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.ఎమ్మెల్యే సార్ సెటిల్మెంట్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.బహుశా ఈ డబ్బులు ఎంత మంది చేతులు మారుతున్నాయో అని జనాలు చర్చించుకుంటున్నారు https://t.co/wDecy510SV
— TeluguNRIBulletinBoard (@TeluguNRInews) October 8, 2026
రోడ్డున పడ్డ అంతర్గత కుమ్ములాటలు.. కూటమిలోనూ కలకలం!
ఈ సెటిల్మెంట్ల వ్యవహారంతో పోలవరం జనసేనలో చాన్నాళ్లుగా దాగి ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. సీనియర్ నాయకులను, మండల అధ్యక్షులను ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో సొంత పార్టీలోనే ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు కూటమి భాగస్వాములైన టీడీపీ, బీజేపీ నేతలను కూడా కలుపుకొని పోకపోవడంతో క్షేత్రస్థాయిలో కేడర్ గందరగోళంలో పడింది.
గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల ఫోన్ సంభాషణ లీక్ అయినప్పుడే ఎమ్మెల్యే అవినీతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే కొన్ని ఇంటర్వ్యూలలో సీనియర్లను కించపరిచేలా మాట్లాడటంతో వర్గపోరు పతాక స్థాయికి చేరింది.
పవన్ కళ్యాణ్ క్లాస్ పీకినా మారని తీరు!
ఎమ్మెల్యే బాలరాజు వైఖరి, ఆరోపణలపై గతంలోనే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గతంలో తీవ్రంగా స్పందించారు. అమరావతికి పిలిపించుకుని పనితీరుపై సమీక్ష నిర్వహించిన పవన్.. వ్యక్తిగత విషయాలు, అవినీతి ఆరోపణల వల్ల పార్టీ ప్రతిష్టకు మచ్చ తెస్తే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని గట్టిగా క్లాస్ పీకారు. నెల రోజుల్లోగా తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఆ సమయంలో తన తప్పులు దిద్దుకుంటానని, సమయం కావాలని కోరిన ఎమ్మెల్యే బాలరాజు.. ఇప్పుడు మళ్లీ ఏకంగా ఇసుక, మట్టి పంచాయితీల వీడియోలతో దొరికిపోవడం అధిష్ఠానానికి మింగుడుపడటం లేదు. అధినేత ఇచ్చిన వార్నింగ్‌ను కూడా బేఖాతరు చేస్తూ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న పోలవరం ఎమ్మెల్యేపై పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.














Click it and Unblock the Notifications
