Pawan Kalyan: కాకినాడ చేరుకున్న పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కాకినాడ చేరుకుంది. సర్పవరం జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ పలు ఆరోపణలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి బియ్యం ఎగుమతి చేసి వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంట్లో అందురు గూండాలేనని ఆరోపించారు. నోటి దూల కొద్దీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి తనపై వ్యాఖ్యలు చేశారని పవన్ మండిపడ్డారు.

తాను నోరు విప్పితే ఆయన కనిపించే వారు కాదని పవన్ హెచ్చరించారు. వైసీపీ పార్టీ, నేతలపై తనకు ఎటువంటి కోపం లేదన్నారు పవన్ కల్యాణ్. వారు చేసే క్రిమినల్ చర్యలు, దోపిడీ, లూటీ, కబ్జాల వల్లే ఎదురు తిరిగానని చెప్పారు. క్రైమ్ చేసే వాడు ఏ కులమైనా వదిలే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశాడు. ఎస్సీ, బీసీ యువతను చంపేస్తుంటే అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. కులం నుంచి ఏపీ బయటపడకపోతే ఏపీ సర్వనాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.

Jana Sena President Pawan Kalyan Varahis Victory Yatra has reached Kakinada

ప్రజానవాణిలో కాకినాడ ఎమ్మెల్యేపై పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ద్వారంపూడిపై తనకు వ్యక్తిగత కోపం లేదన పవన్.. క్రిమినల్స్ రాజ్యమేలుతుంటే తనకు ఇష్టముండదని చెప్పారు. సినిమా నటుడిగా ఉన్నందున 2009 నుంచి.. రాజకీయాలపై దృష్టి సారించలేదన్నారు. 2009 నుంచి రాజకీయాలపై దృష్టి సారించి ఉంటే.. జగన్ను అధికారంలోకి రానిచ్చే వాడిని కాదన్నారు పవన్ కల్యాణ్.

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర జూన్ 23 తేదీ వరకు జరగనుంది. జూన్ 20న ముమ్మిడివరంలో వారాహి యాత్ర, సభ జరగనుంది. జూన్ 21 అమలాపురం, జూన్ 22న పి.గన్నవరం, జూన్ 23న నరసాపురంలో వారాహి విజయ యాత్ర ముగింపు సభ ఉండనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+