నేను పర్సనల్ మాట్లాడితే, బ్రహ్మచారులా, జగన్! నేను ఊపేసేవాడిని: బాబు-రాహుల్‌లను ఏకేసిన పవన్

భీమవరం: తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం గట్టి కౌంటర్ ఇచ్చారు. భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తాను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే జగన్ తనను వ్యక్తిగతంగా తిట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Recommended Video

    జ‌గ‌న్ లా దోచుకోవ‌డానికి రాజ‌కీయాల్లోకి రాలేదు: ప‌వ‌న్

    మీ ఫ్యాక్షనిజానికి, గూండాగిరికి పవన్ ఏమాత్రం భయపడరని చెప్పారు. బాంబులు వేసినా, వేటకొడవళ్లు తీసుకొచ్చినా, బరిసెలు తీసుకు వచ్చినా.. తన లోపల విప్లవం రగులుతోందని, తనను ఎవరూ భయపెట్టలేరన్నారు. నేను జగన్‌ను అడిగింది ఒక్కటేనని, అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని వ్యాఖ్యానించారు.

    పర్సనల్ మాట్లాడాలంటే.. కత్తులు పట్టే వీరమహిళలు

    పర్సనల్ మాట్లాడాలంటే.. కత్తులు పట్టే వీరమహిళలు

    తాను జగన్‌ను ఓ ప్రశ్న అడుగుతున్నానని, ఇక్కడి డ్రైన్ పైన మీ అభిప్రాయం, అక్వా ఫుడ్ పార్క్ పైన మీ అభిప్రాయం, తాగునీటికి ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని వీటిపై మీ అభిప్రాయం చెప్పాలని పవన్ నిలదీశారు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడగలడని చెప్పారు. మీ అభిప్రాయాలకు నేను భయపడే వ్యక్తిని కాదన్నారు. మీరు దాడులు చేసినా భయపడనని చెప్పారు. మీలా నా వద్ద వేల కోట్లు లేవని, గూండాలు లేరని చెప్పారు. తన వద్ద జనసైన్యం మాత్రమే ఉందన్నారు. నా వద్ద కత్తులు పట్టుకునే వీర మహిళలు ఉన్నారని చెప్పారు.

    నేను ఒక్కడిని, అటువైపు నలుగురు.. ప్రశ్నిస్తా

    నేను ఒక్కడిని, అటువైపు నలుగురు.. ప్రశ్నిస్తా

    జగన్‌తో పాటు ముఖ్యమంత్రికి నేను చెబుతున్నానని, నేను పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే.. పవన్‌ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు, లోకేష్ అంటున్నారని, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే తప్పుదోవ పట్టించినట్లా అన్నారు. నేను చంద్రబాబు, లోకేష్, జగన్, గోకరాజు రంగరాజులకు సవాల్ విసురుతున్నానని, గోదావరి జిల్లాపై డిస్కషన్ పెట్టాలని, నేను ఒక్కడినే మాట్లాడుతానని, అటువైపు వారు నలుగురు ఉండవచ్చునని, ఇదే భీమవరంలో, ఇదే సెంటర్లో చర్చిద్దామని, నేను ప్రశ్నలు అడుగుతానని, వారు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు.

    జగన్! నేను ప్రభుత్వాన్ని ఊపేసేవాడిని

    జగన్! నేను ప్రభుత్వాన్ని ఊపేసేవాడిని

    జగన్! నీలా నేను ప్రతిపక్ష స్థానంలో ఉండే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఊపేసేవాడినని పవన్ అన్నారు. జగన్ అసెంబ్లీలో చంద్రబాబును ఎదుర్కొనే ధైర్యం లేక పారిపోయారన్నారు. ఆయనకు ముఖ్యమంత్రిని ఎదుర్కొనే శక్తి లేదన్నారు. మీ స్థానంలో నేను ఉంటే ఊపేసేవాడినని, కానీ మీరేం చేస్తున్నారని జగన్‌ను ప్రశ్నించారు. నేను ప్రభుత్వ పాలసీలపై, సమస్యలపై మాట్లాడుతుంటే కొందరు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.

    నేను తెరిచిన పుస్తకం, మీకంటే బెట్టర్

    నేను తెరిచిన పుస్తకం, మీకంటే బెట్టర్

    పవన్ కళ్యాణ్ తెరిచిన పుస్తకమని, చెడో, మంచో అన్నీ అందరికీ తెలుసునని చెప్పారు. చాలామందివి తెరవని పుస్తకాలు అన్నారు. దాపరికాలు ఉంటాయన్నారు. కానీ అందరిలా తన వద్ద దాపరికాలు లేవన్నారు. నా వద్ద ఎలాంటి సీక్రెట్స్ లేవన్నారు. మీ కంటే నేను చాలా బెట్టర్ అన్నారు.

    మీ రాహుల్ గాంధీ బ్రహ్మచారా, నేను పర్సనల్‌గా అంటే తట్టుకోలేరు

    మీ రాహుల్ గాంధీ బ్రహ్మచారా, నేను పర్సనల్‌గా అంటే తట్టుకోలేరు

    పవన్ కళ్యాణ్ ఒకటి కాదు, రెండు కాదు.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని, రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదని కాంగ్రెస్ నేత వీ హనుమంత రావు అన్నారని, పెళ్లి చేసుకోనంత మాత్రాన మీ వాళ్లు బ్రహ్మచారులా అని ఘాటుగా ప్రశ్నించారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శించే వారికి ఒక్కటే చెబుతున్నానని, మీ అందర్నీ కలిపినా మీ కంటే నేను చాలా బెట్టర్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయమంటే మీకంటే నేను చాలా చేయగలనని అన్నారు. మీరు తట్టుకోలేనంత విమర్శలు చేయగలనని చెప్పారు. నన్ను పర్సనల్‌గా తిడితే సమస్యలు పరిష్కారం అవుతాయంటే అలా తిట్టించుకోవడానికి కూడా సిద్ధమన్నారు.

    ఆకాశం నుంచి దిగిరాలేదు, యూనివర్సిటీలో ఏం చేసారో తెలుసు

    ఆకాశం నుంచి దిగిరాలేదు, యూనివర్సిటీలో ఏం చేసారో తెలుసు

    వ్యక్తిగత జీవితంపై దాడి చేయాలంటే ఎవరూ గొప్పగా లేరని పవన్ అన్నారు. ఎవరూ ఆకాశం నుంచి దిగిరాలేదన్నారు. యూనివర్సిటీలో తువ్వాళ్లు కట్టుకొని ఏం చేశారో తెలుసునని ఘాటుగా మండిపడ్డారు. నన్ను ఇబ్బంది పెట్టమని సీఎం పేషీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని చెప్పారు. ప్యాక్షనిస్టులకు భయపడేది లేదన్నారు. నేను విమర్శిస్తే ఊపిరిపీల్చుకోలేనంత, తట్టుకోలేనంత వ్యక్తిగత విమర్శలు చేయగలనని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+