జనసేన క్యాలెండర్ విడుదల, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: 'త్వరలో మరింతమంది జనసేనలోకి'

అమరావతి: జనసేన పార్టీ ఆదివారం 2019 ఏడాది క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ మేరకు జనసేన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో క్యాలెండర్‌ను ట్వీట్ చేసింది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యూరప్‌లో పర్యటిస్తున్నారు.

నూతన సంవత్సరం నేపథ్యంలో జనసేన పార్టీ 2019 క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఎరుపు రంగులో పార్టీ గుర్తుతో క్యాలెండర్‌ను తీసుకు వచ్చింది.

 Jana Sena releases calendar 2019

దీనికి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న, పోరాటయాత్రలో నడుస్తున్న ఫొటోలను అటాచ్ చేసింది. ఈ క్యాలెండర్‌ను అభిమానులు, జనసేన కార్యకర్తలు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా ట్విట్టర్‌లో లింక్ ను పోస్ట్ చేసింది.

పవన్ సీఎం కావాలని దుర్గమ్మకు జనసేన పూజలు

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన శ్రేణులు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ సెంట్రల్‌కు చెందిన నేతలు, కార్యకర్తలు ఆదివారం తెల్లవారుజామున ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్‌కు ఏపీలో రాజకీయంగా రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. త్వరలోనే మరింత మంది నేతలు జనసేనలో చేరుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+