స్థానిక ఎన్నికల్లో జనసేన కోరుకుంటున్న స్థానాలు, లిస్టులో...!?

ఏపీలో స్థానిక ఎన్నికల కోసం రంగం సిద్దం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మక పోరుగా భావిస్తున్నారు. 2024 ఎన్నికల తరహాలో ఏకపక్షంగా విజయం సాధించి.. 26 నెలల పాలనకు ప్రజా మద్దతుగా నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. అటు వైసీపీ సైతం ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. ఈ సమయంలోనే జనసేన ఈ సారి తమకు సీట్ల సంఖ్య విషయం లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పోటీ స్థానాల పైనా కసరత్తు చేస్తోంది.

స్థానిక ఎన్నికల పైన డిప్యూటీ సీఎం పవన్ ఇప్పటికే ప్రాధమికంగా కసరత్తు చేసారు. ఇందు కోసం కమిటీ ఏర్పాటు చేసి.. పోటీ చేయాల్సిన స్థానాలు.. స్థానిక సమన్వయం పైన స్పష్టత ఇచ్చారు. అదే సమయంలో 2024 ఎన్నికల నాటి ఫార్ములా మేరకు సీట్ల కేటాయింపు స్థానిక ఎన్నికల్లో ఉండదని... జనసైనికుల ఆత్మగౌరవం నిలబడేలా పోటీ ఉంటుందని స్పష్టం చేసారు. కాగా, అదే సమయంలో కూటమికి నష్టం లేకుండా పోటీ చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ నెలాఖరు లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు పార్టీల మధ్య సీట్ల షేరింగ్.. పోటీ స్థానాల పైన స్పష్టత కోసం తొలుత సమన్వయ కమిటీ సమావేశం కానుంది. ఆ తరువాత సీఎం చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి పోటీ చేసే స్థానాలను ఫైనల్ చేయనున్నారు.

 ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టు ఎంత, వారికి డేంజర్ బెల్స్ - ఇదీ లెక్క..!!
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టు ఎంత, వారికి డేంజర్ బెల్స్ - ఇదీ లెక్క..!!
jana-sena-seeks-fair-share-of-seats-in-andhra-pradesh-local-body-elections-here-the-expecting-list

జనసేన కసరత్తు

అయితే, జనసేన ఇప్పటికే చేసిన ప్రాధమిక కసరత్తులో తాము పోటీ చేయాలని భావిస్తున్న స్థానా పైన ఒక జాబితా తో సిద్దం అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16 కార్పోరేషన్లు ఉండగా.. అందులో జనసేన ఏలూరు, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి అడగాలని భావిస్తోంది. అయితే, విజయవాడ కోసం ఇప్పటికే డిమాండ్ మొదలైంది. టీడీపీ మచిలీపట్నం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తిరుపతి లేదా విశాఖలో ఒకటి ఇవ్వాలని కోరేందుకు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇక.. మున్సిపాల్టీల్లో భీమవరం , పిఠాపురం, తాడేపల్లి డెం, తెనాలి, చీరాల, తణుకు, అమలాపురం, నరసాపురం, అనకాపల్లి, మండపేట, నిడదవోలు, పెద్దాపురం, రామచంద్రాపురం, సామర్లకోట, సత్తెనపల్లి, తుని, గొల్లప్రోలు, కొవ్వూరు, నగరి, పెడన, పుత్తూరు, తాడిగడప, వుయ్యూరు, యలమంచిలి, జంగారెడ్డిగూడెం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయితీల్లో పంపకాల వేళ ఖరారు చేసే నిష్పత్తి ఆధారంగా పంచాయితీలు ఖరారు కానున్నాయి. దీంతో.. మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు.. ఎవరికి ఏ స్థానం దక్కుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+