కూటమిలో జెడ్పీ స్థానాలు కొలిక్కి, ఏ పార్టీకి ఎక్కడ - ఆ సీటు కోసం పట్టు..!!

స్థానిక ఎన్నికల కోసం కూటమి పార్టీలు తుది కసరత్తు చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల సీట్ల ఖరారు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సారి జెడ్పీ స్థానాల విషయంలో మూడు పార్టీల నేతలు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. పెద్ద సంఖ్యలో మూడు పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా జెడ్పీ స్థానాల ఖరారులో దాదాపు స్పష్టత వచ్చింది. అధికారిక ప్రకటనకు సిద్దం అవుతున్నారు.

జెడ్పీ స్థానాల విషయంలో మూడు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సర్దుబాటు బాధ్యతను స్థానిక నేతలకు రాష్ట్ర నాయకులు అప్పగించారు. జడ్పీ ఛైర్మన్ స్థానాలపై రాష్ట్రస్థాయిలో సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. తమకు ఎనిమిది జడ్పీ స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతోంది. అయితే, 5-6 వరకు జనసేనకు దక్కే అవకాశం ఉందని సమాచారం. అందులో ఇప్పటికే అల్లూరి సీతారామరాజు మణ్యం, అనకాపల్లి స్థానాలు జనసేనకు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో జనసేన ప్రతిపాదనల పైన చర్చ సాగుతోంది. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, అనంతపురం, ప్రకాశం, తిరుపతి జెడ్పీ ఛైర్మన్లు తమకు కేటాయించాలని జనసేన గట్టిగా పట్టు బడుతోంది.

మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్- తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
మోదీ కేబినెట్ లో ఏపీకి మరో బెర్తు, ఆయనకే ఛాన్స్- తెలంగాణ నుంచి ఆ ఇద్దరూ..!?
janasena-bjp-leaders-meets-cm-chandra-babu-over-finalization-of-zp-chairman-seats-among-alliance-p

తుది కసరత్తు... ఈ రోజే స్పష్టత

అయితే, జనసేన కు ఆరు స్థానాలు కేటాయిస్తారని చెబుతున్నారు. ఈ రోజు చర్చల తరువాత అధికారికంగా తేల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీకి జెడ్పీ పీఠం దక్కే అవకాశం లేదని సమాచారం. కాగా.. జడ్పీ చైర్మన్‌ స్థానాల వరకు కూటమి పార్టీల రాష్ట్ర నాయకత్వం సర్దుబాటు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ చైర్మన్‌, 659 జడ్పీటీసీ స్థానాలు, 660 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలపై కూటమి పార్టీల నడుమ అవగాహన కుదరాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన తరువాత తుది నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీల సర్దుబాటు బాధ్యత స్థానిక జిల్లా నాయకత్వాలకు ముఖ్యంగా సమన్వయ కమిటీలకు అప్పగించా లని కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన అగ్రనేతలు నిర్ణయించారు. కాగా.. పశ్చిమగోదావరి జడ్పీ ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జడ్పీ ఛైర్మన్ రేసులో జనసేన నుంచి పీవీఎల్ నరసింహారాజు, తెలుగుదేశం పార్టీ నుంచి పోత్తూరు రామాంజనేయరాజు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీటు కోసం రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+