వైసీపీ నేత బంధువుకు పవన్ కల్యాణ్ టికెట్? .. ఇదేం రాజకీయం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ పోటీచేస్తున్నారు. ఆయనకు గ్రీన్ కో అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా ఆయన బంధువులే. వీరిలో బండారు నరసింహారావు ఒకరు. వాస్తవానికి ఎంపీ బంధువులు అనగానే సహజంగానే వైసీపీకి సానుభూతిపరులుగా ఉంటారు. ఇక్కడ ఒక సంచలనం ఏమిటంటే.. బండారు నరసింహారావుకు జనసేన తరఫున మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశాన్ని కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రచారం చేసే పవన్ కల్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ కీలక నేత బంధువుకు టికెట్ ఇవ్వాలనుకోవడం అనేది పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ సందేశం పంపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు. చలమలశెట్టి వ్యాపారాలకు వైఎస్ జగన్ భూసంతర్పణ చేస్తున్నారంటూ జనసేన పార్టీ నాయకులు రోడ్లెక్కి నిదర్శన ప్రదర్శనలు చేశారు.

మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీచేయడానికి వల్లభనేని బాలశౌరికి మొదట్లోనే టికెట్ కేటాయించారుకానీ అది పెండింగ్ లో పడింది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలంటూ జనసేన బాలశౌరికి సూచిస్తోంది. బాలశౌరి మాత్రం దీనికి ఒప్పుకోవడంలేదు. ఏదో ఒకవిధంగా వల్లభనేనిని అవనిగడ్డకు ఒప్పించి అక్కడి నుంచి బండారు నరసింహారావుకు టికెట్ ఇవ్వాలనే ప్రయత్నాల్లో పవన్ కల్యాణ్ ఉన్నారు. చివరకు ఈ రాజకీయం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. కాకినాడలో గెలుపుపై సునీల్ కు అవకాశాలు లేకపోతే మచిలీపట్నం నుంచి బండారుకు అవకాశం ఉన్నా కంపెనీకి ఎటువంటి ఢోకా ఉండదనే వ్యాపార వ్యూహాలు కూడా ఇమిడివున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications