జేడీ రాజీనామాను ఆమోదించిన పవన్ కల్యాణ్.. ఆ విషయాలు కూడా ప్రస్తావించాల్సిందని కౌంటర్..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆమోదించారు. లక్ష్మీనారాయణ భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని పవన్ కల్యాణ్ ఓ లేఖ విడుదల చేశారు. తాను మళ్లీ సినిమాల్లోకి వెళ్లడాన్ని తప్పు పట్టిన జేడీకి లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను మళ్లీ సినిమా చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. అదే సమయంలో జేడీ రాజీనామా చేసినంత మాత్రాన.. ఆయనపై తమకున్న గౌరవమేమీ పోదని,అది ఎప్పటికీ అలాగే ఉంటుందని స్పష్టం చేశారు.

జేడీ ఇవి కూడా ప్రస్తావించాల్సింది..

తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ప్రాజెక్టులు, గనులు, పాల ఫ్యాక్టరీలు లాంటివి లేవని.. అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగిని కూడా కానని లేఖలో పేర్కొన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని.. తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయని చెప్పారు. వారి కోసం, తన కుటుంబం కోసం, పార్టీకి ఆర్థిక పుష్టి కోసం సినిమాలు చేయడం తప్పనిసరి అని తెలిపారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ గారు తెలుసుకుని తన రాజీనామాలో ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు.

పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడంపై అసంతృప్తి..

పవన్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లడంపై అసంతృప్తి..

జనసేన పార్టీకి రాజీనామా చేస్తూ గురువారం సాయంత్రం జేడీ రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చాక పూర్తి జీవితం ప్రజాసేవకే అంకితం చేస్తానని చెప్పిన పవన్ మాటమార్చారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. మళ్లీ సినిమాల్లో నటించాలని పవన్ తీసుకున్న నిర్ణయం నిలకడలేని ఆయన విధివిధానాలను స్పష్టం చేస్తోందన్నారు. అందుకే జనసేన నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నానని లేఖలో వెల్లడించారు. తన వెంట నడిచిన ప్రతీ కార్యకర్తకు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Recommended Video

    JD Lakshmi Narayana Resigns To Janasena Party | జనసైనికులు ఏం అనుకుంటున్నారు ?
    జేడీ ఎందుకు వీడినట్టు...

    జేడీ ఎందుకు వీడినట్టు...

    బీజేపీతో పొత్తు విషయంలో లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీతో పొత్తు ద్వారా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జనసేన తరుపున తనకు విశాఖ సీటు దక్కుతుందో లేదోనని ఆయన భావించినట్టు చెబుతున్నారు. విశాఖలో ఇదివరకు బీజేపీ నుంచి హరిబాబు,పురంధేశ్వరి వంటి నేతలు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వారు మళ్లీ ఆ సీటు ఆశించవచ్చు. అలాంటిపక్షంలో జేడీ త్యాగం చేయక తప్పదు. అది తన రాజకీయ భవిష్యత్తుకు ఆటంకం కలిగించేది అవుతుందన్న ఉద్దేశంతో జేడీ పార్టీని వీడినట్టుగా జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+