స్థానిక ఎన్నికల వేళ పవన్ బిగ్ డెసిషన్, ఏరి కోరి ఎంపిక..!!

ఏపీలో స్థానిక ఎన్నికలను డిప్యూటీ సీఎం పవన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్టీ బలోపేతం కోసం సరైన సమయంగా భావిస్తున్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి ఎన్నికల్లో అవకాశం ఇచ్చేలా ఆలోచన చేస్తున్నారు. కూటమిలో తాము కోరుకుంటున్న సీట్ల పైన పవన్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసారు. సీఎం చంద్రబాబుతో సమావేశం వేళ ఆ జాబితా అందించారు. ఇక.. అభ్యర్ధుల ఎంపిక పైనా ఫోకస్ చేసారు. ఇందు కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అడ్ హక్ కమిటీలను పవన్ ఏరి కోరి ఎంపిక చేయటంతో పాటుగా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు.

జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధత, సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ కమిటీలను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ కమిటీల పనితీరును పవన్ స్వయంగా పర్యవేక్షణ చేయనున్నారు. త్వరలోనే ప్రతీ పార్లమెంట్ కమిటీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నేరుగా దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం పైనా పవన్ నిర్ణయించారు.

పవన్ ఆన్ డ్యూటీ: ఇక నేరుగా, స్థానికం వేళ బిగ్ డెసిషన్..!!
పవన్ ఆన్ డ్యూటీ: ఇక నేరుగా, స్థానికం వేళ బిగ్ డెసిషన్..!!
pawan-kalyan-appoints-ad-hoc-committees-to-monitor-ground-situation-for-local-body-elections-here-t

పవన్ కొత్త నిర్ణయాలతో

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలతో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటిల్లో సభ్యులను పవన్ ఏరి కోరి ఎంపిక చేసారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ పైనా పార్టీ నేతలకు పవన్ దిశా నిర్దేశం చేసారు. కూటమికి నష్టం లేకుండానే వ్యవహరిస్తూ.. పార్టీ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలకు పవన్ పదును పెడుతున్నారు. అందులో భాగంగా ఫ్రెండ్లీ కంటెస్ట్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటీషన్ కొట్టివేయటంతో.. ఇక రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఆ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో పవన్ వరుస నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+