జగన్ కోసం భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను: పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిది ఈరోజు పుట్టినరోజు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను' అంటూ శుభకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ను జనసేన పార్టీ విడుదల చేసింది.

రాష్ట్రవాప్తంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 'సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు.

janasena chief pawan kalyan birthday wishes to ap cm ys jagan

ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైసీపీకి చెందిన నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కేక్‌ కట్‌ చేశారు. జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆయురారోగ్యాలతో తమ నాయకులు నూరేళ్లు చల్లగా ఉండాలని వారంతా అభిలషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+