మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకటే?
తన ఇంటి చుట్టుపక్కల పరిసరాలకు సంబంధించిన పరిస్థితులనే ముఖ్యమంత్రి సమీక్షించుకోకపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు.
తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ ఉందా?.. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గరలోనే ఘాతుకాలు జరిగినా మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులకు, గంజాయికి అడ్డాగా తాడేపల్లి మారిందని, గతంలో తాడేపల్లిలోనే జరిగిన రేప్ కేసులో ఒక నిందితుడిని ఇంతవరకు పట్టుకోలేకపోయారని విమర్శించారు.
తన ఇంటి చుట్టుపక్కల పరిసరాలకు సంబంధించిన పరిస్థితులనే ముఖ్యమంత్రి సమీక్షించుకోకపోతే ఎలా అని, తప్పులు జరిగితే తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులున్న ప్రభుత్వమన్నారు. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని చెప్పే మంత్రులున్న ప్రభుత్వమని, అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఏపీని గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చారని, మౌనంగా ఉండే నాయకులు కోటలో ఉన్నా.. పేటలో ఉన్నా ఒకేటనన్నారు. యువతిని కిరాతకంగా చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతంలో అంధురాలైన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆ యువతిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోగా ప్రాణాలు కోల్పోయింది. ఆమెపై దాడి చేసిన వ్యక్తిని స్థానికుడైన రాజుగా పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులోనే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. రాజు ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు అతడిని మందలించారు. కక్ష పెంచుకున్న రాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు












Click it and Unblock the Notifications