Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అస్వస్థత..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హెలికాప్టర్ లో హైదరాబాద్ వెళ్లారు. పవన్ గత రెండు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయినా కూడా పవన్ ప్రచారానికి హాజరయ్యారు. వారాహి విజయభేరిని వాయిదా వేయడానికి ఇష్టపడని పవన్ జ్వరంతోనే వచ్చారు. పవన్ వెంట వైద్యులు ఉన్నప్పటికీ జ్వరం తగ్గనట్లు సమాచారం. ఆయన జ్వరంతోనే శనివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

పవన్ కల్యాణ్ ఆదివారం అంటే నిన్న శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత బేజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఎండ వేడికి నిరసించిపోవడంతో జ్వరం మళ్లీ పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లోనే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. పవన్ త్వరలోనే పుంజుకుని పర్యటన కొనసాగిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ హెల్త్ పై అభిమానులు, కార్యకర్తలు ఆందోళనగా ఉన్నారు.

Janasena chief Pawan Kalyan fell ill

పవన్ కల్యాణ్ ఎండ తీవ్రత కారణంగానే నీరసపడినట్లుగా జనసేన నేతలు చెబుతున్నారు. పవన్ ఆరోగ్యం విషయంలో కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ శనివారం నుంచి తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున పవన్ పూర్తి కోలుకున్నాకే ప్రచారం ప్రారంభించనున్నాట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+