సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 4 లక్షల మందికి పింఛన్ల తొలగింపునకు సంబంధించి ఇచ్చిన నోటీసులపై ఆయన ఈ లేఖ రాశారు. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను ప్రభుత్వం తగ్గించుకునే దిశగానే ఇలా వ్యవహరిస్తోందన్నారు. ఎందుకు తొలగించకూడదో సమాధానం చెప్పాలంటూ నోటీసులిచ్చారని, ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని పవన్ ప్రశ్నించారు.

25 సంవత్సరాల క్రితం మరణించినవారు ఇప్పటికీ ఆదాయపు పన్ను కడుతున్నారంటూ నోటీసుల్లో చూపిస్తున్నారని, వింతువులకు ఇచ్చే పింఛన్లు రద్దు చేస్తామంటున్నారని, ఈ తరహా నోటీసులు సమర్థనీయమవునో? కాదో? ఆలోచించాలన్నారు. పేదలను బాధపడకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉందని గుర్తుచేశారు.

janasena chief pawan kalyan open letter to ap cm jagan

శ్రీకాకుళం జిల్లా మొళియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్ల రద్దు నోటీసులు ఇచ్చారన్నారు. వీరి పేరుమీద ఏలాది ఎకరాల భూములుంటే వాటికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పెనుకొండలో రజక వృత్తిపై ఆధారపడిన రామక్క అనే పింఛనుదారుకి 158 ఇళ్లు ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారని, ఒకవేళ నిజంగా ఇళ్లుంటే వాటిని చూపించాలన్నారు. సొంతిల్లే ఉంటే వారంతా పింఛన్ల కోసం వాలంటీర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమొస్తుందని ప్రశ్నించారు. పేదలకు పింఛన్లు అందజేయడంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+