మారుతున్న పవన్ లెక్కలు, కొత్త ఫార్ములా - కీలక భేటీ.. ఫైనల్ డెసిషన్..!!

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రెండు వైపులా గెలుపు ప్రతిష్టాత్మకం గా తీసుకున్న వేళ హోరా హోరీగా మారుతోంది. ఇదే సమయంలో ఈ ఎన్నికల పైన పవన్ లెక్క స్పష్టంగా ఉంది. 2024 తరహాలో సీట్లు అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇక, సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ వేళ ఫైనల్ నిర్ణయం రానుంది.

జనసేనాని పవన్ స్థానిక ఎన్నికల్లో సీట్ల పైన స్పష్టమైన వైఖరితో ఉన్నారు. తమకు కావాల్సిన సీట్ల కోసం జనసేన గట్టిగానే పట్టుబడుతోంది. 2024 ఎన్నికల సమయంలో 21 సీట్లకు పరిమితమైన జనసేన స్థానిక ఎన్నికల్లో నాటి ఫార్ములా అమలు కాదని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. పవన్ సైతం జనసేన కార్యకర్తల గౌరవానికి తగ్గకుండా సీట్ల పైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని జనసేన నేతలు పదే పదే చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలోనూ జనసేనలో సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మూడు పార్టీల కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడితో సీట్ల పంపకాలు కీలకంగా మారుతున్నాయి. జనసేన విజయవాడ, తిరుపతి, ఒంగోలు, కాకినాడ మేయర్ సీట్లతో పాటుగా పలు మున్సిపల్ చైర్మన్ సీట్ల పైన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మున్సిపాల్టీలను తమకు ఇవ్వాలని జనసేన ప్రతిపాదిస్తోంది.

 ఉచిత బస్సు పథకంలో కీలక మార్పు - ఇక నుంచి అమలు ఇలా..!!
ఉచిత బస్సు పథకంలో కీలక మార్పు - ఇక నుంచి అమలు ఇలా..!!
janasena-chief-pawan-kalyan-planning-to-propose-new-formula-for-seat-sharing-in-local-body-elections

పవన్ కీలక ప్రతిపాదనలు

ఇదే సమయంలో జెడ్పీల విషయంలోనూ ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర తో పాటుగా తిరుపతి- అన్నమయ్య జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో.. తాజాగా పార్టీ నేతల సమావేశంలో జనసేన నేత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కేరళ నుంచి తిరిగి వచ్చిన పవన్ ముందుగా పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహించనున్నారు. పార్టీ ప్రతిపాదనల పైన ముఖ్య నేతలతో చర్చించిన తరువాత ఈ నెల 16 లేదా 17న సీఎం చంద్రబాబుతో పవన్, మాధవ్ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. ఆ సమావేశంలో పవన్ తమ పార్టీ నుంచి ప్రతిపాదిత స్థానాల పైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్, బీజేపీ ప్రతిపాదనల పైన సీఎం చంద్రబాబు పరిశీలన చేసి.. తదుపరి సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. జనసేన, బీజేపీ నుంచి సీట్ల విషయం లో వస్తున్న కొత్త ప్రతిపాదనల పైన టీడీపీ స్పందన ఏంటీ.. ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+