చంద్రబాబు అరెస్ట్ పై పవన్ కీలక వ్యాఖ్యలు - ఆ ప్రస్తావన లేకుండా..!!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయ సంచలనంగా మారుతోంది. చంద్రబాబు అరెస్ట్ పైన జనసేనాని పవన్ స్పందించారు. చంద్రబాబుకు తన మద్దతు ప్రకటించారు. అరెస్ట్ తీరును పవన్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యకు వైసీపీ కారణమని ఆరోపించారు. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అరెస్ట్ ను ఖండించారు. వామపక్షాల నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు.

స్పందించిన పవన్ కల్యాణ్ : చంద్రబాబు అరెస్ట్ పైన జనసేనాని పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రాధమిక ఆధారాలు చూపకుండా అర్దరాత్రి అరెస్టు చేసే విధానానాన్ని వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఆరోపించారు. గతంలో ఏ తప్పూ చేయని జనసేన నాయకుల పై హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని గుర్తు చేసారు. నంద్యాలలో చంద్రబాబు అరెస్టు చేసిన తీరు ను సంపూర్ణంగా జనసేన ఖండిస్తుందని చెప్పారు.

Janasena Chief Pawan Kalyan reacts on TDP Chief Chandra Babu Arrest in skill development Scam, fires on Govt

పాలనా పరంగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి పట్ల అనుసరిస్తున్న వైఖరి కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. చిత్తూరులో కూడా ఇదే విధంగా చంద్రబాబు పట్ల ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు మద్దతు : అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సింది పోలీసులే కదా..వైసీపీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. నేడు ఈ పరిస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణంగా వైసీపీ ప్రభుత్వం కాదా అని పవన్ నిలదీసారు. ఒక నాయకుడు అరెస్టు అయితే.. అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి రావడం సహజమని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు..

అయినా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. వారి నాయకులను అరెస్టు చేసే.. ఇంట్లో నుంచి బయటకు రానీయకూడదంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎక్కడా చంద్రబాబును ఏ కేసులో అరెస్ట్ చేసారు.. కేసు అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావన చేయలేదు.

కేసు అంశాన్ని ప్రస్తావించకుండా : నంద్యాలలో అరెస్ట్ చేసిన చంద్రబాబును ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా సీఐడీ అధికారులు విజయవాడ తరలిస్తున్నారు. చంద్రబాబును ఈ కేసులో విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ అధికారులు స్పష్టం చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అంతిమ లబ్దిదారుడు చంద్రబాబేనని సీఐడీ చెబుతోంది. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను నిరిసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. పలు ప్రాంతాల్లో నేతలను ముందస్తు అరెస్ట్ చేసారు. పలు ప్రాంతాల్లో ఆర్టీసి బస్సులను నిలిపివేసారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం తో ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+