Pawan Kalyan: చంద్రబాబు - బాలినేనికి జనసేనాని ఛాలెంజ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి ప్రత్యేక కారణం ఉంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒక ఛాలెంజ్ చేసారు. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. చేనేత కళాకారులను ప్రభుత్వం నుంచి మంత్రి కేటీఆర్ సత్కరించనున్నారు. దీంతో.. కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేనేత ఉత్పత్తుల ప్రమోషన్స్ పైన ఛాలెంజ్ చేస్తూ ఒక ట్వీట్ చేసారు. దీనికి జనసేన అధినేత పవన్ స్పందించారు.

Recommended Video

    KTR ఛాలెంజ్ కు దీటుగా చంద్రబాబు కు పవన్ చేసిన ట్వీట్ వైరల్ *Politics | Telugu OneIndia
    కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన పవన్

    కేటీఆర్ ఛాలెంజ్ స్వీకరించిన పవన్


    రామ్ భాయ్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లుగా పవన్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు. చేనేత మహిళలు.. చేనేత వర్గానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసారు. ఇదే సమయంలో పవన్ కూడా ఈ ఛాలెంజ్ ను టీడీపీ అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి..వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనిస రెడ్డి.. బీజేపీ రాజ్యసభ సభ్యుుడు లక్ష్మణ్ కు సైతం ఛాలెంజ్ చేస్తూ ట్యాగ్ చేసారు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేతగా చంద్రబాబుకు ట్యాగ్ చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

    చంద్రబాబు - బాలినేనికి ఛాలెంజ్


    వైసీపీ మీద ఎప్పుడూ విరుచుకుపడే పవన్ కళ్యాన్.. కొద్ది రోజుల క్రితం వరకూ ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో బాలినేని పైన ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు ట్యాగ్ చేయటం చర్చనీయాంశంగా మారింది. జనసేనకు చెందిన ఓ మహిళా నేతను అర్ధరాత్రి పోన్ చేసి వైసీపీ నేతలు బెదిరించారని పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో తమ కార్యకర్తల్ని భయపెట్టాలని చూస్తే ఊరుబోబోనని పవన్ హెచ్చరికలు చేశారు. అలాగే జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపైనా పవన్ విమర్శలు చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి జనసేన నేతలపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని కోరినట్లుగా స్వయంగా బాలినేనే వెల్లడించారు.

    ఆ ఇద్దరూ పవన్ ఛాలెంజ్ కు స్పందిస్తారా

    ఆ ఇద్దరూ పవన్ ఛాలెంజ్ కు స్పందిస్తారా


    ఇక, ఇప్పుడు పవన్ నేరుగా బాలినేనికి ఈ ట్వీట్ ట్యాగ్ చేయటం మరోసారి రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. అయితే, ప్రకాశం జిల్లాలో చేనేత వర్గాలు ఎక్కువగా ఉండటంతో..ఆ జిల్లా సీనియర్ నేత..మాజీ మంత్రిగా బాలినేనికి ట్యాగ్ చేసారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పవన్ ఛాలెంజ్ చేస్తూ హ్యాండ్లూమ్స్ కు సంబంధించిన ఫొటోలు షేర్ చేయాలని సూచించారు. దీనికి ఇప్పుడు చంద్రబాబు..బాలినేని ..లక్ష్మణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+