Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్ - సమర్ధతకు పరీక్ష..!!

ఏపీ ఎన్నికల రాజకీయంలో పవన్ కీలకంగా మారారు. జగన్ ఓటమే లక్ష్యంగా పవన్ మూడు పార్టీల కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ అక్కడ నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ కు బీజేపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. టార్టెట్ 400 సీట్లతో అడుగులు వేస్తున్న బీజేపీ ప్రతీ సీటు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ తాజా టాస్క్ పవన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.

ప్రచారంలో పవన్
పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమిలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు ఎంపీ, 21 మంది ఎమ్మెల్యే అభ్యర్దుల తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వారాహి తో ప్రచారం ప్రారంబించారు.

Janasena Chief Pawan Kalyan to campaign in Karnataka in support of BJP candidates

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిన పవన్ ఈ సారి ఎలాగైనా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే లక్ష్యంతో ఉన్నారు. అదే సమయంలో తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్థానాల్లో మెజార్టీ గెలిపించుకోవటానికి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇందుకోసం తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఈ సమయంలోనే బీజేపీ నేతలు బిగ్ టాస్క్ అప్పగించారు.

బీజేపీ కీలక బాధ్యతలు
పవన్ కల్యాన్ ను కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ నాయకత్వం సూచించింది. బెంగళూరు సిటీ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు గెలుపు ఓటమలును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. గతంలోనూ పవన్ అక్కడ ప్రచారం చేసారు. బెంగళూరు బీజేపీ నేతలు పవన్ తో ఎక్కడ ప్రచారం చేయించాలనే అంశం పైన చర్చించారు.

ప్రతిపక్షనేత అశోక్‌, ఎంపీ తేజస్వీ సూర్య బెంగళూరు దక్షిణ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంపై ప్రణాళికలు సిద్ధం చేశారు. బెంగళూరు దక్షిణ పరిధిలో బొమ్మనహళ్లి, బీటీఎం లేఅవుట్‌, హెచ్‌ఎ్‌సఆర్‌ లేఅవుట్‌, జయనగర్‌, జేపీనగర్‌, బసవనగుడితో పాటు బెంగళూరు సెంట్రల్‌ పరిధిలోని మారతహళ్లి, బెంగళూరు ఉత్తర పరిధిలోని యలహంక ప్రాంతాల్లో పవన్‌కల్యాణ్‌ రోడ్‌షోలు నిర్వహించాలని నిర్ణయించారు.

సమర్ధతకు పరీక్ష
ఏపీలో ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు కావటంతో..పవన్ ప్రచార తేదీల పైన సమాచారం కోరినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రచార సమయంలోనూ బెంగళూరులోనూ పవన్ మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెబుతున్నారు. దీంతో, పవన్ ఇప్పుడు ఏపీలో కూటమి గెలుపు దిశగా పవన్ పైన కీలక బాధ్యతలు ఉన్నాయి.

ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత టీడీపీ, బీజేపీ నేతలతో కలిసి పవన్ ఉమ్మడి ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఇక, బెంగళూరులో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ అభ్యర్దులకు మెజార్టీ ఓట్లు దక్కుతాయని బీజేపీ భావిస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీ అంచనాలకు తగినట్లుగా ఫలితం రాబట్టటం పవన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+