Modis cabinet 3.0:ఎంపీ బాలశౌరికి కేంద్రమంత్రి ఛాన్స్...జనసేనకు పండగే..!
కేంద్ర కేబినెట్‌లో జనసేన నుంచి ఎవరు అడుగుపెట్టే అవకాశం ఉంది..జనసేన పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలుగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం నుంచి బాలశౌరి మరొకరు కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్. తంగెళ్ల ఉదయ్ తొలిసారి పార్లమెంటులో అడుగుపెడుతున్నాడు. ఇక బాలశౌరీ ముచ్చటగా మూడోసారి ఎంపీ అయ్యారు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎవరిని కేబినెట్‌లోకి పంపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బాలశౌరికి ఎంపీగా మూడుసార్లు చేసిన అనుభవం, కేంద్రంలో మంచి పరిచయాలు ఉండటంతో పవన్ బాలశౌరి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసి కేవలం మూడు నెలలు మాత్రమే ఎన్నికల ప్రచారం చేసి దాదాపు 2,23,179 ఓట్ల మెజార్టీతో భారీ విజయం కైవసం చేసుకున్నారాయన.
బాలశౌరి అంటే అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్..
బాలశౌరి తెనాలి ఎంపీగా 2005లో ఎన్నికయ్యారు. ఆ నాటి నుంచి నేటి వరకు తన పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు విరివిగా చేపట్టడం, ప్రజా సమస్యను పరిష్కరించడమే తన ధ్యేయంగా ముందుకు సాగారు. తెనాలి ఎంపీగా ఉన్న సమయంలో దివిసీమ ప్రాంతం అయిన అవనిగడ్డ నియోజకవర్గంలో అనేకమంది రొయ్యల చెరువులు సాగు చేసి నష్టపోయి,, పొలాలను బీడుభూములుగా వదిలేసి వలసవెళ్లిపోయారు. ఈ సమస్యను తెలుసుకున్న ఎంపీ బాలశౌరి దాదాపు 18 వేల ఎకరాలను ఆ రోజుల్లో క్రేన్లుపెట్టి పూడ్పించారు. దీనిని ఇప్పటికీ దివిసీమ ప్రాంత రైతులు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇక తెనాలి పార్లమెంట్‌లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, తాగునీటి సమస్య, రోడ్ల సమస్యల పరిష్కారం కోసం కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి ఆయా సమస్యలను పరిష్కరించారు.

ఇక 2019లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి రెండో దఫా ఎంపీగా గెలుపొందారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు, ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రూ.4వేల కోట్ల రూపాయాల రుణం తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. అదేవిధంగా గుడివాడ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.350కోట్లు, సీఎస్‌ఆర్ నిధులు రూ.40కోట్ల వరకు తీసుకొచ్చి అనేక కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఆసుపత్రుల్లో మౌలికసదుపాయాల కల్పన వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఎంపీ బాలశౌరి. ఈ అభివృద్ది కార్యక్రమాలే ఆయనకు ఎంతో మంది ప్రజల అభిమానాన్ని తీసుకొచ్చింది. అనేక మంది మహిళలు, పేదలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారు స్వయం ఉపాధితో ఎదిగేందుకు దోహదపడ్డారు ఎంపీ బాలశౌరి. ఆయన చేసిన అనేక కార్యక్రమాలు చూసి.. బాలశౌరి అంటే అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా మచిలీపట్నం ప్రజలు చెప్పుకోవడం విశేషం.
కేంద్రంలో చక్రం తిప్పగలిగే సత్తా ఉన్న నేతగా..
ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ఎంపీలుగా గెలుపొందారు. కానీ ఎంపీ బాలశౌరి శైలి మాత్రం అందరికంటే ప్రత్యేకం.కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేక విధాలుగా తీసుకురాగలిగే సత్తా ఉన్న నేతగా ఎంపీ బాలశౌరికి మంచి పేరు ఉంది. కేంద్ర మంత్రులతో సత్ససంబంధాలు, కేంద్ర అధినాయకత్వంతో కూడా మంచి పరిచయాలు ఉండటంతో ఏ సమస్యను అయినా వారికి వివరించి, అక్కడి నుంచి నిధులు తీసుకురావడంతో ఎంపీ బాలశౌరి సఫలీకృతులు అయ్యారు. అదేవిధంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీఎస్‌ఆర్ నిధులు భారీగా తీసుకువచ్చిన ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. నిధులే కాకుండా కేంద్రంతో ముడిపడి ఉన్న ఈ సమస్యను అయినా పట్టువీడని విక్రమార్కుడిలా దాన్ని పరిష్కరించగల ఎంపీగా బాలశౌరికి మంచి పేరు ఉంది.

మంత్రి పదవి వస్తే తన మార్కు అభివృద్ది..
ఎన్డీయే కూటమి ఎంపీగా బాలశౌరికి ప్రస్తుతం మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు భారీగా తీసుకురావడమే ముఖ్యలక్ష్యంగా ఆయన అడగులు వేసే అవకాశం ఉంది. దీంతోపాటు మచిలీపట్నం పోర్టు కోసం నిధులు, పోలవరం నిర్మాణం కోసం నిధులు తీసుకురావడం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా బాలశౌరికి మంత్రి పదవి వస్తే... జనసేన పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపీ బాలశౌరి ఫాలోవర్స్ అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కితే.. కేడర్‌లో ఫుల్ జోష్ వస్తుందనడంలో ఏ సందేహం లేదు. దీంతోపాటు జనసేన పార్టీ బలోపేతం కావడానికి కూడా ఇది దోహదపడనుంది.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications