చిరంజీవి విషయంలో పవన్ కల్యాణ్ అసంతృప్తి?
మెగాస్టార్ చిరంజీవి విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో చిరంజీవి ఉమ్మడి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారుకానీ తర్వాత రాజకీయంగా వేయాల్సిన ఎత్తుగడలు, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తట్టుకోవడానికి ప్రతివ్యూహాల్లాంటివి తన మనస్తత్వానికి నచ్చవనే కారణంతో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తర్వాత రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నారు.
కొత్తగా విడుదలైన సినిమాలకు సంబంధించి టికెట్ ధరలను పెంచుకోవడానికి అమనుతి తీసుకునేందుకు చిరంజీవి పరిశ్రమలోని ఇతర హీరోలు, దర్శకులను తీసుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. ఆ సమయంలో చిరు జగన్ కు నమస్కారం చేసి తమ ప్రతిపాదలను వివరించారు. ముఖ్యమంత్రి నవ్వుతూ ఉండటం అనేది అప్పట్లో బాగా ట్రోలింగ్ జరిగింది. ఇదే విషయం పవన్ కల్యాణ్ ను కూడా బాధించింది. వాస్తవానికి తన సినిమాలకు వ్యాపారం జరగకుండా చేసేందుకే ఏపీ ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు చేసిందని పార్టీ సమావేశంలో జనసేనాని చెబుతుంటారు.

చిరంజీవికి అలా మాట్లాడాల్సిన అవసరంలేదని, పరిశ్రమ బాగుండాలనే కోరికతోనే వెళ్లారని, కానీ అన్నయ్యను అలా అవహేళనగా చూడటాన్ని తట్టుకోలేకపోయినట్లు పవన్ చెప్పేవారు. ఇదే విషయాన్ని పవన్ చిరుతో కూడా చెప్పారు. ఏ విషయంలోను మీరు మాట్లాడాల్సిన అవసరంలేదని, ఒకవేళ మాట్లాడాల్సి వస్తే మిమ్మల్ని మీరు తగ్గించుకొని మాట్లాడాలనుకుంటే అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమమన్నారు. రాజకీయంగా తమ పార్టీల మధ్య జరిగే పోరులో, ఎత్తుగడల్లో చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి అవమానానికి, అవహేళనకు గురికావడం తనకు ఏమాత్రం ఇష్టంలేదని, మరోసారి ఎక్కడా ఈ తరహా వినతులను రావద్దని గట్టిగా పవన్ తన అన్నకు చెప్పారు.












Click it and Unblock the Notifications