గేరు మార్చిన పవన్, కీలక నిర్ణయాలు - ఇక, ఢిల్లీ కేంద్రంగా..!!

జనసేనాని పవన్ కల్యాణ్ రూటు మార్చారు. పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏపీ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యారు. దీని కోసం కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే పార్టీ నేతలతో పవన్ కీలక భేటీ ఏర్పాటు చేసారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కేంద్రం ప్రతిష్ఠాత్మక బిల్లులను ప్రవేశ పెడుతున్న వేళ.. పవన్ కొత్త నిర్ణయాల దిశగా కీలక దిశా నిర్దేశం చేయనున్నారు.

సర్జరీ తరువాత పవన్ కోలుకుంటున్నారు. పలువురు పవన్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్దం చేస్తోంది. అందులో భాగంగా మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తో పాటుగా మరిన్ని బిల్లుల ఆమోదం దిశగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. గత సమావేశాల్లో మెజార్టీ లేక ఈ బిల్లులు వీగిపోయాయి. అయితే, టీఎంసీ.. శివసేన నుంచి వచ్చిన ఎంపీల మద్దతు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఈ బిల్లుల ఆమోదానికి కావాల్సిన సంఖ్యా బలం ఎన్డీఏ దాదాపు కూడగట్టింది. దీంతో.. ఈ సమావేశాల్లో నే మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన బిల్లుల ఆమోదం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నెల 21న ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

janasena-chief-pawan-to-hold-crucial-meeting-with-party-mps-over-parliament-sessions-and-central-bi

పార్లమెంట్ సమావేశాల వేళ కీలక దిశా నిర్దేశం

కాగా.. ఈ కీలక బిల్లులు.. సమావేశాల పైన పార్టీ ఎంపీలతో పవన్ సమావేశం కానున్నారు. పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. డీలిమిటేషన్ బిల్లు వేళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే వాదన విపక్షాలు లేవనెత్తుతున్న వేళ.. జనసేన ఎంపీలకు ఈ విషయం పైన పవన్ స్పష్టత ఇవ్వనున్నారు. కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాల కు ఎలాంటి అన్యాయం జరగదనే వాదన బలంగా తీసుకెళ్లాలని నిర్దేశించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏపీకి సంబంధించిన అంశాల పైన జనసేన ఎంపీలకు పవన్ కీలక సూచనలు చేయనున్నారు. ఇక.. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన.. ఏపీ నుంచి కొత్తగా మరొకరికి అవకాశం ఉంటుంది అనే ప్రచారం వేళ... జనసేన కేంద్ర కేబినెట్ లో చేరటం పైనా పవన్ నిర్ణయం కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+